SRISAILAM MALLANNA GETS PRESENTATION FROM TIRUMALA VENKANNA_శ్రీశైలం మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఈవో

Tirumala, 9 February 2018: The famous Lord Mallikarjuna Swamy received gift in the form of silk clothes from Tirumala Venkateswara Swamy on Friday evening.

TTD EO Sri Anil Kumar Singhal has presented the silk vastrams to his contemporary of Srisailam temple Sri Bharat Gupta on behalf of Tirumala temple.

As the annual brahmotsavams in Srisailam are underway till February 16, these vastrams will be decorated to Lord for the occasion.

OSD of Tirumala temple Sri P Seshadri and chief priest of Srisailam temple Sri M Mallikarjuna Swamy were also ptesent.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీశైలం మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఈవో

తిరుపతి, 09 ఫిబ్రవరి 2018 ; ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు శ్రీశైలం ఆలయ ఈవో డా|| నారాయణ భరత్‌గుప్తా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి పట్టువస్త్రాలను స్వీకరించారు. ఫిబ్రవరి 6 నుండి 16వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజుల్లో స్వామివారికి ఈ పట్టువస్త్రాలను అలంకరిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీవారి ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి, శ్రీశైలం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎం.మల్లికార్జునస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.