PAVITROTSAVAMS POSTERS RELEASED_ తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 20 Sep. 19: The annual Pavitrotsavams of Sri Lakshmi Narasimha Swamy temple at Tarigonda will be observed from September 29 till October 1 with Ankurarpanam on September 28.

The posters related to this three-day fete were released by JEO Sri P Basant Kumar in his chambers in TTD Administrative Building in Tirupati on Friday.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2019 సెప్టెంబరు 20: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 29 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో శుక్ర‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ సెప్టెంబ‌రు 28న సాయంత్రం ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు. సెప్టెంబ‌రు 29న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబ‌రు 30న పవిత్ర సమర్పణ, అక్టోబ‌రు 1న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నున్నాయ‌ని వివ‌రించారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చ‌ని, గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌నివాస‌మంగాపురం ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.