SRIVARI DARSHAN FOR 15th FINANCE COMMISSION CHAIRMAN _ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న 15వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ శ్రీ నందకిషోర్ సింగ్‌

Tirumala, 19 Dec. 19: The 15th Finance Commission Chairman Sri Nanda Kishore Singh and other members along with AP Finance Minister Sri Buggana Rajendranath Reddy had darshan of Lord Venkateswara on Thursday morning.

After the darshan the Vedic pundits rendered Ashirvachanam and the TTD Chairman Sri YV Subba Reddy and Additional EO Sri AV Dharma Reddy presented them Srivari prasadam and thirthams at the Ranganayakula mandapam.

The Finance commission secretary Sri Arvind Mehta, Assistant Secretary Sri Ravi Kota, members Sri Sjashi Bhushan Tomar, Smt Radha Singh and Smt Padmini Sen was also with him.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న 15వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ శ్రీ నందకిషోర్ సింగ్‌

తిరుమ‌ల‌, 19 డిసెంబ‌రు 2019: 15వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ శ్రీ నందకిషోర్ సింగ్, ఇత‌ర స‌భ్యులు గురువారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు.  ఆ త‌రువాత తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అందజేశారు.

 శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వారిలో ఆర్థిక సంఘం కార్య‌ద‌ర్శి శ్రీ అర్వింద్ మెహ‌తా, స‌హాయ కార్య‌ద‌ర్శి శ్రీ ర‌వి కోట‌, స‌భ్యులు శ్రీ శ‌శిభూష‌ణ్ తోమ‌ర్‌, శ్రీ‌మ‌తి రాధా సింగ్‌, శ్రీ‌మ‌తి ప‌ద్మిని సేన్ ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.