TTD CHAIRMAN AND EO COURTESY CALL ON SARADA PEETHAM PONTIFF _ శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి టిటిడి ఛైర్మన్, ఈవో
Tirumala, 19 Dec. 19: TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy on Thursday paid a courtesy call on the Vizag Sharada peetham pontiff Sri Sri Sri Swaroopananda Saraswati Swami at his ashram near Gogarbham in Tirumala and sought his blessings.
While speaking with media the TTD Chairman said the Pontiff had made some valuable suggestions which will be taken up for ratification at the next meeting of the TTD board for implementation.
He said as per the agenda for Sanatana dharma propagation and also the suggestion of Peethathipatis the TTD would hereafter, host religious and dharmic conventions and programs at Tirumala every month.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి టిటిడి ఛైర్మన్, ఈవో
తిరుమల, 19 డిసెంబరు 2019: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి వారిని టిటిటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింగ్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రబద్ధంగా కైంకర్యాలు జరుగుతున్నాయని, ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై ఆగమ సలహాదారులు, ఆలయ ప్రధానార్చకులతో కలిసి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామివారిని సంప్రదించామని తెలిపారు. స్వామీజీ పలు సలహాలిచ్చారని, రానున్న ధర్మకర్తల మండలి సమావేశంలో వీటిపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. సనాతన ధర్మప్రచారంలో భాగంగా ప్రతినెలా తిరుమల లేదా తిరుపతిలో పీఠాధిపతులతో ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.
కాగా, స్వామీజీని కలిసిన వారిలో ఆగమ సలహాదారులు శ్రీ సుందరవదన భట్టాచార్యులు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు తదితరులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.