SRIVARI DARSHAN FOR POOR DEVOTEES ENDS _ శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం మ‌హ‌దానంద‌క‌రం

  • LIFETIME ACHIEVEMENT, SAYS FIRST TIME VISITORS TO TIRUMALA
  • DEVOTEES ENTER SRIVARI TEMPLE CHANTING GOVINDA NAMAM

 Tirumala, 14 Oct. 21: TTD’s Srivari Brahmotsava Darshan to devotees of weaker sections and from remote regions successfully completed on Thursday.

As part of its agenda for propagation of Sanatana Hindu Dharma TTD took up this challenging task in collaboration with AP endowment department and the Samarasata foundation to provide Srivari Brahmotsavam darshsn to devotees of this category.

It was an exhilarating devotion packed scene at hill shrine as devotees walked through Tirumala corridors chanting Govinda, Govinda and entered Srivari temple during this year Srivari Brahmotsavam.

All the devotees were brought to Tirumala in free buses and accommodated at PAC-2. They arrived in groups with ecstatic look on their faces and Govinda bhajan on their lips as they entered Srivari temple.

For many devotees from Visage, East & West Godavari, and Vizianagaram, it was their first ever visit to Tirumala and lifetime achievement of Srivari Darshan. They profusely thanked TTD for providing the divine opportunity of visit to Tirumala, Tirupati and Tiruchanoor and Darshan of their believed God.

In the first phase TTD jointly with Samarasata Seva foundation and Endowment development have built 502 Sri Venkateshwara temples in remote areas of all 13 districts of AP. Devotees from these regions were selected and brought to Tirumala for Srivari Brahmotsavam Darshan.

From each district 10 buses were organised for devotees and especially from East Godavari and Visakhapatnam districts devotees were brought in 20 buses. In all 150 free buses were chartered from 13 districts to ferry 1000 devotees daily from October 7-14 and in all 7350 were provided Srivari Brahmotsavam Darshan. The devotees were provided food and beverages with support of local donors and they were also offered Goddess Sri Padmavati Darshan at Tiruchanoor.

The schedule of Srivari Darshan district wise was as follows:

October 7: Chittoor and Kadapa

October 8: Guntur, Prakasam

October 9: East Godavari and Rampachodavaram

October 10: West Godavari, Krishna

October 11: Kurnool, Anantapur

October 12: Visakhapatnam and Paderu

October 13: Srikakulam, Vizianagaram

October 14: SPSR Nellore.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం మ‌హ‌దానంద‌క‌రం

తొలిసారి తిరుమ‌లకు వ‌చ్చిన ప‌లువురు భ‌క్తులు

కొండ‌పై భ‌జ‌న‌లు చేసుకుంటూ ఆల‌యంలోకి ప్ర‌వేశం

వెనుకబడిన పేద వర్గాల భక్తులకు ద‌ర్శ‌నం పూర్తి

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 14: క‌లియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమ‌ల క్షేత్రంలో వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని జీవితంలో ఒక్క‌సారైనా ద‌ర్శించుకోవాల‌నేది ప్ర‌తి హిందువు కోరిక‌. మ‌న రాష్ట్రంలోనే ఉన్నా వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి స్వామివారిని ద‌ర్శించుకోలేని ప‌రిస్థితి వారిది. అలాంటి వెనుక‌బ‌డిన పేదవ‌ర్గాల భ‌క్తుల గురించి ఆలోచించి వారికి బ్ర‌హ్మోత్స‌వ‌ ద‌ర్శ‌నం క‌ల్పించాల‌నే నిర్ణ‌యానికి కార్య‌రూపం ఇచ్చింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. స‌మ‌ర‌స‌తా సేవ ఫౌండేష‌న్‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించి భ‌క్తులను ఎంపిక చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్తి చేసింది.

టిటిడి పిలుపుతో భ‌క్తులు గోవింద‌నామ‌స్మ‌ర‌ణ చేస్తూ, భ‌జ‌న‌లు చేసుకుంటూ ఉచిత బ‌స్సుల్లో తిరుమ‌ల‌కు చేరుకున్నారు. టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారులు పిఏసి-2లో వారికి బ‌స ఏర్పాట్లు చేశారు. హ‌రినామ‌స్మ‌ర‌ణ వైశిష్ట్యాన్ని, హిందూ ధ‌ర్మం గొప్ప‌ద‌నాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేశారు. అక్క‌డినుండి భ‌క్తులు భ‌జ‌న‌లు చేసుకుంటూ శ్రీ‌వారి ఆల‌యంలోకి ప్ర‌వేశించి త‌న్మ‌య‌త్వంతో స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలైన వైజాగ్‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల నుండి తొలిసారి తిరుమ‌ల‌కు వ‌చ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఈ అవ‌కాశం క‌ల్పించిన టిటిడికి వారు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో టిటిడి మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలు నిర్మించింది. ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి పేదవర్గాల వారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించింది. ఒక్కో జిల్లా నుండి 10 బస్సులు ఏర్పాటుచేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ ప్ర‌కారం 13 జిల్లాల నుండి మొత్తం 150 బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు వెయ్యి మంది చొప్పున అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు 8 రోజుల్లో 7,350 మందికి టిటిడి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మార్గమధ్యంలో స్థానిక దాతల సహకారంతో ఆహార పానీయాలను టిటిడి అందించింది.

అక్టోబ‌రు 7న చిత్తూరు, క‌డ‌ప జిల్లాలు, అక్టోబ‌రు 8న గుంటూరు, ప్ర‌కాశం జిల్లాలు, అక్టోబ‌రు 9న తూర్పుగోదావ‌రి, అదే జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం, అక్టోబ‌రు 10న ప‌శ్చిమ‌గోదావ‌రి, కృష్ణా జిల్లాలు, అక్టోబ‌రు 11న క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాలు, అక్టోబ‌రు 12న విశాఖ‌, అదేజిల్లాలోని పాడేరు, అక్టోబ‌రు 13న శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు, అక్టోబ‌రు 14న నెల్లూరు జిల్లా నుండి భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.