SRIVARI DARSHAN WILL CONTINUE AT TIRUMALA – TTD CHAIRMAN _ శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం కొన‌సాగిస్తాం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala, 16 Jul. 20: Srivari darshan for devotees will continue at Tirumala taking all Covid-19 precautions without fail, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Speaking to reporters at Annamaiah Bhavan on Thursday the TTD Chairman said there was no change in the present system of Srivari Darshan and daily Kaikaryams are being conducted as per the tenets of Vaikanasa Agama.

He said in view of COVID-19 the health security of both visiting pilgrims and TTD employees are being safeguarded by following all prescribed guidelines by Government. 

“As of now 140 cases of Covid-19 have been reported in TTD till date. Majority of affected cases are among Potu workers and APSP security personnel”, he observed.

He said 70 Covid-19 affected staff members have recovered and a few of them are in home quarantine while some others are back in duties. Of the remaining 70 persons under treatment, only one person is in ICU. TTD is providing quality medical support to the patient in ICU and doctors opine that he too is likely to recover soon. 

The Chairman said only 14 of the 40 Archakas of Srivari temple had reported positive and TTD has taken all steps to ensure that there was no break in Nitya Kainkaryams in the temple and Archakas will be given assured healthcare.

He said as sought by archakas separate rooms and quality food will be provided to them. Arrangements were made and senior Archakas are asked to stay back in their homes. If they wish, they can offer their duties in TTD local temples at Tirupati.

He asserted that none of the devotees who came for Srivari darshan has reported Covid-19 positive so far. There have been no instances of any employees affected by devotees. “Most of the Covid-19 infections of TTD employees were only through their family members and living surroundings.

Responding to a question he said anyone who is working in TTD or in the organizations associated to TTD could send their suggestions to TTD board on improving conditions. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం కొన‌సాగిస్తాం :  టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 2020 జూలై 16:  తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు కొన‌సాగుతాయ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నం వ‌ద్ద గురువారం త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో ఛైర్మ‌న్ మాట్లాడారు.

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ద‌ర్శ‌నాల విధానంలో ఎలాంటి మార్పు లేద‌ని, ఆలయంలో నిత్య కైంకర్యాల‌ను, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను ఆగ‌మ‌శాస్త్రబ‌ద్ధంగా నిర్వ‌హిస్తున్నామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా, రాష్ట్ర‌వ్యాప్తంగా కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డంతో భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం మెరుగైన ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్టు చెప్పారు. టీటీడీలో ఇప్పటివరకు 140 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ‌ని, వీరిలో ఏపీఎస్పీలో పనిచేసే దాదాపు 60 మంది భ‌ద్ర‌తా సిబ్బంది, 16 మంది పోటు కార్మికులు, 14 మంది అర్చ‌కులు, ఇత‌ర ఉద్యోగులు ఉన్నార‌ని వివరించారు. 70 మంది ఇప్ప‌టికే కరోనా నుంచి కోలుకున్నార‌ని, వీరిలో కొంద‌రు హోమ్ క్వారంటైన్‌లో ఉండ‌గా, మిగిలిన‌వారు విధుల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని తెలిపారు. మ‌రో  70 మంది చికిత్స పొందుతూ కోలుకుంటున్నార‌ని, ఒక్కరు మాత్రమే స్విమ్స్ ఐసియులో చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఉద్యోగికి మెరుగైన వైద్యం అందిస్తున్నామ‌ని, త్వ‌ర‌గా కోలుకుంటార‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని తెలియ‌జేశారు.

శ్రీ‌వారి ఆల‌యంలో విధులు నిర్వ‌హించేందుకు మొత్తం 40 మంది అర్చ‌కులు ఉండ‌గా, వారిలో 14 మందికి పాజిటివ్ కేసులు రావ‌డంతో స్వామివారికి కైంక‌ర్యాలు నిర్వ‌హించేందుకు ఎలాంటి అటంకం క‌ల‌గ‌కుండా చూడ‌డంలో భాగంగా అర్చకుల ఆరోగ్యంపై స‌మీక్షించామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. వేరువేరుగా గ‌దులు కేటాయించి భోజ‌న వ‌స‌తి క‌ల్పించాల‌ని,  వ‌య‌సు పైబ‌డిన అర్చ‌కులకు ఇంట్లో ఉండేందుకైనా, తిరుప‌తిలో విధులు కేటాయించేందుకైనా అర్చ‌కులు కోరార‌ని, ఆ మేర‌కు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామ‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో ఇప్పటివ‌ర‌కు భ‌క్తులెవ‌రికీ పాజిటివ్ కేసులు రాలేద‌ని, అలాగే భ‌క్తుల ద్వారా ఉద్యోగులు వ్యాధిబారిన ప‌డ‌లేద‌ని తెలిపారు. ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల ద్వారా లేదా వారి ప‌రిస‌ర ప్రాంతాల ద్వారా మాత్ర‌మే పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌న్నారు. అదేవిధంగా, మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ టిటిడిలో గానీ, టిటిడికి అనుబంధంగా ప‌నిచేస్తున్న‌వారు గానీ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌ద‌లిస్తే బోర్డుకు తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.