SRIVARI LADDU PRASADAM AT HALF PRICE TO DEVOTEES- ADDITIONAL EO _ భ‌క్తుల‌కు సగం ధరకే శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 23 May 2020: TTD is at set to sell laddus at half of its price at all its Kalyana Mandapams located in the Head Quarters of 13 districts of Andhra Pradesh from May 25 onwards, said TTD Additional Executive Officer Sri A V Dharma Reddy.

Flagging off lorries carrying laddu Prasadam from Tirumala to all districts on Saturday morning, he said that uncertainty prevailed on the resumption of Srivari darshan to devotees which was suspended for over 60 days following Coronavirus lockdown across the country.

In this backdrop, he said, TTD has been receiving mails, phone calls, WhatsApp Messages for at least supply of Srivari laddu Prasadam which is as sacred as darshan of the lord.

TTD board favourably decided to resume laddu Prasadam supply and also offered huge subsidy at ₹25/- per laddu instead of the regular price of ₹50 per laddu without loss- profit considerations.

He said two lorries each with Srivari laddus started for Srikakulam, Visakhapatnam, Guntur, Krishna,

East and West Godavari districts and same would reach remaining destinations by Sunday. TTD will store 15,000-20,000 laddus at TTD Kalyana Mandapams in all district headquarters in the state.

All arrangements are made at the Kalyana Mandapams for distribution of Srivari laddus to devotees. TTD employees, Srivari sevakulu, HDPP staff, police and revenue officials are adequately deployed to observe social distancing and sanitise environment at the sale points of laddu sales.

Adding further he said, only small quantities of big Kalyanotsavam laddus were prepared only for use in daily rituals at Srivari temple.

Earlier the Additional EO also participated in the 44th day of the Yogavashistam – Dhanvantari Maha Mantra parayanam underway at the Nada Niranjanam in Tirumala organised by the Dharmagiri Veda vijnan peetham. He also performed Gow-puja on the occasion of Rohini Nakshtram.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

భ‌క్తుల‌కు సగం ధరకే  శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం  – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2020 మే 23: తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదాల‌ను సగం ధరకే మే 25వ తేదీ సోమ‌వారం నుండి రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి రాష్ట్రంలోని వివిధ‌ జిల్లాల‌కు ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను తీసుకు వెళ్ళే లారీల‌ను శ‌నివారం ఉద‌యం ఆయ‌న ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా భ‌క్తుల‌కు తిరుమల‌ శ్రీవారి ద‌ర్శ‌నాన్ని దాదాపు 60 రోజులుగా నిలిపివేసిన‌ట్లు తెలిపారు. తిరిగి భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.  ఈ నేపథ్యంలో అధిక సంఖ్య‌లో భక్తులు ఇ-మెయిల్‌,  వాట్స‌ప్‌, ఫొన్ల‌ల ద్వారా  తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని విజ్ఞప్తులు వచ్చాయ‌న్నారు.  భ‌క్తుల అభ్య‌ర్థ‌న‌లు పరిగణనలోకి తీసుకుని, లాభ నష్టాలను చూడకుండా రూ.50/- ల‌డ్డూను రూ.25/- కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో 15 వేల నుండి 20 వేల ల‌డ్డూల‌ను ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. క‌ల్యాణ‌మండ‌పాల్లోని టిటిడి ఉద్యోగులు, హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు, పోలీస్‌, రెవెన్యూ అధికారుల స‌మ‌న్వ‌యంతో  భౌతిక దూరం పాటిస్తూ భ‌క్తుల‌కు ల‌డ్డూ ప్ర‌సాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు వివ‌రించారు.

అదేవిధంగా శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం ల‌డ్డూను స్వామివారి క‌ల్యాణంలో నివేదించేందుకు అవ‌స‌ర‌మైన ల‌డ్డూల‌ను మాత్ర‌మే త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు. కావున జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌లో చిన్న ల‌డ్డూల‌ను మాత్ర‌మే పంపీణి చేస్తున్నామ‌న్నారు. శ‌నివారం ఉద‌యం శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌పట్నం, గుంటూరు, కృష్ణా, తూర్పు, ప‌శ్చిప గోదావ‌రి జిల్లాల‌కు రెండు‌ లారీల‌లో ల‌డ్డూ ప్ర‌సాదాలు బ‌య‌లు దేరిన‌ట్లు తెలియ‌జేశారు. అదేవిధంగా ఆదివారంనాటికి రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌కు తిరుమ‌ల నుండి ల‌డ్డూ ప్ర‌సాదాలు చేరుతాయ‌న్నారు.  

అంత‌కుముందు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆధ్వ‌ర్యంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణంలో భాగంగా 44వ రోజైన శ‌నివారం ఉద‌యం  అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం రోహిణి న‌క్ష‌త్రం పుర‌స్క‌రించుకుని ఆయ‌న గోపూజ నిర్వ‌హించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.