SRIVARI NAVARATHRI BRAHMOTSAVAM ALSO IN EKANTHAM IN VIEW OF FRESH COVID GUIDELINES FROM CENTRE _ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఏకాంతంగా శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

Tirumala, 13 Oct. 20: Considering the widespread threat of pandemic COVID-19 across the country in and keeping in view the health safety and security of devotees, TTD has decided to conduct the Srivari Navaratri Brahmotsavams scheduled from October 16 to 24 also in Ekantham this year.

A decision to this effect was taken during a detailed review meeting held by the TTD EO Dr KS Jawahar Reddy at his chambers in the TTD administrative Building in which District Collector Sri Bharat Narayan Gupta, TTD Additional EO Sri AV Dharma Reddy, DIG Sri Kranti Rana Tata, TTD JEO Sri P Basanth Kumar and CVSO Sri Gopinath Jatti participated.

Earlier the TTD had announced on October 1 that vahana sevas of Srivari Navaratri Brahmotsavams will be conducted in the Mada streets. However, in view of fresh Covid guidelines issued recently by the Union Health and family welfare ministry, stipulated that none of the religious or cultural utsavams should have any congregation of more than 200 persons even conducted outside.

This direction had come in the background of several festivals across the country during October-December season with chances of big gatherings which would favour further spike in Covid-19. 

In view of the new Covid guidelines, the of TTD had reviewed its earlier decision and decided to conduct the Srivari Navaratri Brahmotsavams also in Ekantham inside the Srivari temple akin to annual Brahmotsvams which were held during last month.

All vahana sevas will be observed at the Kalyanotsava mandapam in Srivari temple. Brahmotsavam rituals and utsavas will be observed as per Agama traditions but inside Srivari temple in Ekantam.

The SVBC will give a live feed of all events while the Public Relations department of TTD will issue Press releases and photos of all events and vahana sevas daily for benefit of devotees across the globe.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఏకాంతంగా శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు
 
తిరుమల, 2020 అక్టోబ‌రు 12: కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇటీవ‌ల విడుద‌ల చేసిన కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ మేర‌కు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సోమ‌వారం టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ గుప్తా, టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి త‌దిత‌రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. 
 
కాగా, ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తించి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లను ఆల‌య మాడ వీధుల్లో నిర్వ‌హించాల‌ని అక్టోబ‌రు 1న టిటిడి ప్రకటించింది. అయితే, అక్టోబ‌రు 6న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూత‌న‌ నిబంధ‌న‌లు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు 200 మందికి మించ‌కుండా మాత్ర‌మే మ‌త‌ప‌ర‌మైన‌, సాంస్కృతిక ఉత్స‌వాలు నిర్వ‌హించాలని సూచన‌ల్లో పేర్కొంది. అదేవిధంగా, అక్టోబ‌రు నుంచి డిసెంబ‌రు వ‌ర‌కు శీతాకాలంలో ప్ర‌ముఖ ఉత్స‌వాలు ఉన్న నేప‌థ్యంలో భ‌క్తులు గుమికూడే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్నందున, క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. కావున భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో గుమికూడ‌రాద‌ని కోరింది. 
 
కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యం వెలుపల నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యాన్ని టిటిడి పునఃస‌మీక్షించింది. ప్ర‌భుత్వ సూచ‌న‌లు పాటిస్తూ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆ మేర‌కు  ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యం తీసుకుంది.
 
ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. టిటిడి ప్ర‌జాసంబంధాల విభాగం మీడియాకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, ఫొటోలు అందిస్తుంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.