GODDESS EMBRACES AS KALIYAMARDHANA KRISHNA _ సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌నుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

Tiruchanoor, 28 Nov. 19: Goddess Sri Padmavathi Devi as Kaliya Mardhana Krishna showered Her divine blessings on the devotees in Sarvabhoopala Vahanam. 

On the sixth day morning on Thursday,  the vahanam procession commenced braving rains under the cover of Ghatatopam as a part of the ongoing brahmotsavams at Tiruchanoor. 

Sarvabhoopala vahanam symbolises the Universal Supremacy of Goddess who is often revered as Sarva Swatantra Veera Lakshmi in Tiruchanoor.

The dance troupes exhibited their arts in the incessant showers throughout the vahana seva. 

Additional CVSO Sri Siva Kumar Reddy,  DyEO Sri C Govindarajan and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌నుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి
 
తిరుపతి, 2019 నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న శ్రీ కృష్ణుని అలంకారంలో  ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
     
శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ.  సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.
 
స్వర్ణరథంపై మెరిసిన  శ్రీ మహాలక్ష్మి

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆనుగ్రహిస్తారు.

గరుడ వాహనంపై లోకమాత
 
గురువారం రాత్రి 7.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ సేవ వైభవంగా జరుగనుంది. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది.

          వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ కాండూరి శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.