AWARENESS SESSION FOR SRIVARI SEVA TEAM LEADERS_ శ్రీవారి సేవ టీమ్ లీడర్లకు అవగాహన సదస్సు
Tirumala, 16 Dec. 18: An awareness session on service to devotees coming for V day celebrations at Tirumala was held for Team leaders of Srivari sevakulu and senor Sevakulu at the Srivari Seva Sadan inside the RTC complex on Sunday evening.
Speaking on the occasion Dr T Ravi, PRO, TTD said duties were allotted to Srivari Sevakulu sector wise at the sheds of Narayanagiri gardens and the mada streets and advised them to take prompt action in supply of drinking water, Annapradadam and also give information on availability of toilets to devotees.
He also urged them to serve the huge crowd of devotees coming for Vaikunta Ekadasi and Dwadasi days to Tirumala as they did with dedication during the last Brahmotsavams.
Among others TTD health officer Dr Sharmistha, Annapradadam OSD Sri Venugopal, catering officer Sri Krishna Shastri, Assistant Public relations officer Kum P Neelima, and AE Sri Varaprasad spoke on the occasion.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీవారి సేవ టీమ్ లీడర్లకు అవగాహన సదస్సు
డిసెంబరు 16, తిరుమల, 2018: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు సేవలందించేందుకు వచ్చిన శ్రీవారి సేవకుల టీమ్ లీడర్లకు, సీనియర్ సేవకులకు ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ లో గల శ్రీవారి సేవా సదన్ లో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా.. టి.రవి మాట్లాడుతూ నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ మాడవీధుల్లో ఏర్పాటుచేసిన షెడ్లలో సెక్టార్ల వారీగా శ్రీవారి సేవకులకు విధులు కేటాయించామన్నారు. అక్కడ భక్తులందరికీ అన్నప్రసాదాలు, తాగునీరు అందించాలని, షెడ్ లకు అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్ల సమాచారాన్ని భక్తులకు తెలియజేయాలని సూచించారు. గత బ్రహ్మోత్సవాల గరుడ సేవ రోజున శ్రీవారి సేవకులు విశేషంగా భక్తులకు సేవలు అందించారని, అదే స్ఫూర్తితో ఏకాదశి, ద్వాదశి నాడు సేవలందించాలని కోరారు.
అనంతరం టిటిడి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, సహాయ ప్రజా సంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఏఈ శ్రీ వర ప్రసాద్ ప్రసంగించారు. ఈ విషయాలపై టీం లీడర్లు తమ బృందంలోని శ్రీవారి సేవకులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.