SRIVARI SEVA GOING TO BE A WORLD CLASS PHENOMENON IN FUTURE – TIRUMALA JEO_ ఆద‌ర్శ‌వంత‌మైన శ్రీవారి సేవాగ్రామంగా తిరుమల : జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజ

Tirumala, 17 Feb. 18: Srivari Seva will be developed as a world class phenomenon in the area of voluntary service, asserted Tirumala JEO Sri KS Sreenivasa Raju.

A review meeting with all the major user departments was held in the camp office of JEO at Gokulam Rest House in Tirumala on Saturday evening.

The JEO directed the Srivari Seva HoD Dr T Ravi, HoDs of other user departments to come with a concrete assessment of Srivari Sevakulu to be deployed in the respective service areas. “In another two months time, Seva Gramam, the new seva sadan building which is coming up behind Kalyana Vedika at a cost of over Rs.80cr. Before that the assessment should be completed so that we can best utilise the services of Srivari Sevakulu”, he added.

He said, the Temple, Vigilance, Annaprasadam, Reception, Health and Kalyanakkata departments should give their reassessment report of deployment of Srivari Sevakulu. “Our vision is to develop Srivari Seva in a fair and professional manner. The intention behind introduction of 3-day and 4-day service is to get able bodied Sevakulu to render best possible services to pilgrims in different service areas”, he maintained.

SE II Sri Ramachandra Reddy, HoDs of Annaprasadam Sri Venugopal, Health Dr Sermista, Temple Sri Harindranath, Reception Sri Sridhar, AVSOs Sri Kurma Rao, Sri Nandeshwar, Sri Chiranjeevulu were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆద‌ర్శ‌వంత‌మైన శ్రీవారి సేవాగ్రామంగా తిరుమల : జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజ

తిరుమ‌ల‌, ఫిబ్ర‌వ‌రి 17, 2018: శ్రీవారి భక్తులకు విశేషంగా సేవలందించేందుకు విచ్చేసే శ్రీవారి సేవకులు బ‌స చేసే ప్రాంతమైన శ్రీ‌వారి సేవాగ్రామాన్ని ఇత‌ర ఆల‌యాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచేలా తీర్చిదిద్దుతామ‌ని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో శనివారం సాయంత్రం శ్రీవారి సేవపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టిన 7 రోజులు, 4 రోజులు, 3 రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 2 రోజుల స్లాట్లకు సేవకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. భ‌క్తుల‌కు సేవలు అందించేందుకు శారీర‌క దారుఢ్యం గ‌ల శ్రీవారిసేవకులు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని పిలుపునిచ్చారు. రూ.80 కోట్ల‌కు పైగా వ్య‌యంతో నిర్మిస్తున్న శ్రీ‌వారి సేవా స‌ద‌న్ 2 నెలల్లో ప్రారంభం కానుంద‌ని తెలిపారు. ఈ భ‌వ‌నంలో సిసిటివి వ్య‌వ‌స్థ‌, రిక్రియేష‌న్ హాల్‌, ఉద్యాన‌వ‌నం త‌దిత‌ర ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌న్నారు.

శ్రీ‌వారి ఆల‌యం, రిసెప్ష‌న్‌, అన్నప్ర‌సాదం, ఆరోగ్య‌, క‌ల్యాణ‌క‌ట్ట‌, విజిలెన్స్ త‌దిత‌ర విభాగాల అధికారులు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసి కావాల్సిన శ్రీ‌వారి సేవ‌కుల సంఖ్య‌ను నిర్ణ‌యిస్తార‌ని తెలిపారు. ఆ త‌రువాత న‌మోదు విధానంలో చేయాల్సిన మార్పుల‌పై దృష్టి పెడ‌తామ‌న్నారు. రెండు నెలల్లో అత్యుత్త‌మైన శ్రీ‌వారి సేవా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేస్తామ‌న్నారు. నూత‌న భ‌వ‌నంలో శ్రీ‌వారి సేవ‌కుల‌కు మంచి అనుభూతి క‌లిగేలా ఏర్పాట్లు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.