BTU OF SRI LN TEMPLE, TARIGONDA FROM FEB 23 – MARCH 4_ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 17 February 2018: The Brahmotsbam of TTD sub temple, Sri Lakshmi Narasimha Swamy Temple of Tarigonda will commence from February 23-March 4 of which Ankurarpanam will be performed on Feb 22.

As part of the celestial event, Koil Alwar Tirumanjanam will be done on Feb 18 and Vahana Sevas will be conducted both in morning and evening during the period of Bramhotsavams. The cultural wings of the TTD- HDPP and Annamacharya projects will organize devotional, Bhajans, Kolatas and Sangeet programs on all the days.

The Kalyanotsvam will be performed on Feb 28 for which interested devotees could participate with Rs 300 ticket and beget prasadam of One Uttariam, One blouse piece, one laddu prasadam. Pushpa yagam will be performed on March 4.

DATE MORNING NIGHT

23-02-18 Dwajarohanam (Meena Lagnam) Hamsa Vahanam
24-02-18 Muthyapupandiri Hanumantha
25-02-18 Kalpavruksha Simha
26-02-18 Tiruchi Pedda Sesha
27-02-18 Tiruchi Utsvam Gaja vahanam
28-02-18 Tiruchi /Kalyanotsavam Garuda Sarvabhopala,
01-03-18 Rathotsavam Dhuli Utsavam
02-03-18 Suryaprabha/Parveta /Aswa Chandraprabha
03-03-18 Chakrasnanam Dwaja avarohanam

ISSUED BY THE TTDS PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 17, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఫిబ్రవరి 18వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు తదితర ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 28వ తేదీన కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు రూ.300/- చెల్లించి పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందిస్తారు. మార్చి 4వ తేదీన పుష్పయాగం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

23-02-18(శుక్రవారం) ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం

24-02-18(శనివారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం

25-02-18(ఆదివారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం

26-02-18(సోమవారం) తిరుచ్చి ఉత్సవం పెద్దశేష వాహనం
27-02-18(మంగళవారం) తిరుచ్చి ఉత్సవం గజ వాహనం

28-02-18(బుధవారం) తిరుచ్చి ఉత్సవం సర్వభూపాలవాహనం, కల్యాణోత్సవం, గరుడ వాహనం.

01-03-18(గురువారం) రథోత్సవం ధూళి ఉత్సవం

02-03-18(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం, అశ్వ వాహనం.

03-03-18(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.