SRIVARI SEVA IS UNDOUBTEDLY A SUPPORTING ARM TO TTD-EO_ శ్రీవారి సేవకులు టిటిడి ప్రతిష్టను మరింత పెంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
SRIVARI SEVA IS UNDOUBTEDLY A SUPPORTING ARM TO TTD-EO
Tirumala, 30 Sep. 19: Describing Srivari Seva as a Supporting Arm of TTD, EO Sri Anil Kumar Singhal asserted that Srivari Seva Volunteers are offering impeccable services to pilgrims at Tirumala.
Addressing the jam-packed massive hall in Asthana Mandapam at Tirumala on Monday, the EO said, the dedication, discipline and devotion of volunteers is unquestionable. However, he urged the sevakulu to give feedback so as to make improvements in pilgrim services.
Recalling their services during last year annual brahmotsavams, Vaikuntha Ekadasi, Radhasapthami, the EO said, 3500 sevakulu who are deployed during these occasions have rendered outstanding services. “Your services are equal to the services of 22 thousand strong work force of TTD”, said EO amidst huge round of applause from sevakulu who hailed from different parts of the country for annual brahmotsavams.
Special Officer Annaprasadam Sri S Venugopal, PRO Dr T Ravi, APRO Ms P Neelima, AEO Sri U Ramesh were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సేవకులు టిటిడి ప్రతిష్టను మరింత పెంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
సెప్టెంబర్ 30, తిరుమల 2019: శ్రీవారి సేవకులు భక్తిభావంతో సేవలందించడం ద్వారా టిటిడి ప్రతిష్టను మరింత పెంచాలని ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ కోరారు. బ్రహ్మోత్సవాల్లో సేవావిధులు నిర్వహించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు సోమవారం తిరుమలలోని ఆస్థానమండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ శ్రీవారి సేవకులు క్రమశిక్షణతో చక్కగా సేవలందిస్తున్నారని కొనియాడారు. భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులపై స్వామివారి కృప తప్పకుండా ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఆయా విభాగాల్లో క్రమశిక్షణతో సేవలందించి, టిటిడి అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. శ్రీవారి సేవకుల ఫీడ్ బ్యాక్ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతున్నామని వివరించారు. అంతకుముందు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విఎస్‌వో శ్రీ మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డా|| ఆర్ ఆర్.రెడ్డి, అన్నదానం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో శ్రీ యు.రమేష్, దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 3,500 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.