SRIVARI SEVA MADE MORE DEVOTEE FRIENDLY_ ఎంచుకున్న విభాగాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులకు అవకాశం

Tirumala, 22 April 2018: The Srivari Sevaks, the service oriented devotees, who throng Tirumala and Tirupati with Govinda nama on their lips will here after wards be provided an option to serve which ever wing they chose to.

On the directions of the Executive Officer Sri Anil Kumar Singhal, the devotees can opt to serve which ever wing they wish to- garden, reception, laddu prasadam, temple or even queue lines in the Srivari Sevaks,Voluntary services wing of TTD.

The TTD says that if they can register online by April 25, they can appear at Tirumala for serving devotees by May 2 itself.

The Srivari Sevak wing has been streamlined since TTD EO took over last year and introduced the option of devotees coming to service individually instead of group of ten and also for decays of serving – 3 days or four days or for a week.

The devotees offering service now under Srivari Seva can choose the wings- Annadanam, health, vigilance, kalyana katta, Reception, Help Desk and Tirunamam. The new system is being enforced from May to June on a pilot basis and devotees have been requested to make use of the opportunity to serve Lord Venkateswara from the location of their choice at Tirumala, Tirupati.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఎంచుకున్న విభాగాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులకు అవకాశం

ఏప్రిల్‌ 22, తిరుమల 2018: తిరుమలలో ఎంచుకున్న విభాగాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులకు టిటిడి అవకాశం కల్పించింది. ఇందుకోసం ఏప్రిల్‌ 25వ తేదీ నుండి భక్తులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. మే 2వ తేదీ నుండి తిరుమలలో సేవలు అందించాల్సి ఉంటుంది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు ఇదివరకే వ్యక్తిగతంగా సేవలందించేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ప్రస్తుతం శ్రీవారి సేవకులు బృందాలుగా, వ్యక్తిగతంగా శ్రీవారి సేవ చేసేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు.

నూతనంగా తిరుమలలో ముఖ్యమైన విభాగాలైన అన్నదానం, ఆరోగ్యశాఖ, నిఘా మరియు భద్రత, కల్యాణకట్ట, వసతి విభాగాలతోపాటు హెల్ప్‌డెస్క్‌, తిరునామం తదితర సేవలను ఎంచుకుని 3 రోజులు, 4 రోజులు, 7 రోజుల సేవ చేసేందుకు టిటిడి అవకాశం కల్పించింది. ఈ నూతన విధానాన్ని మే, జూన్ నెలల్లో ప్రయోగాత్మకంగా అమలుచేస్తారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని జులై నుండి పూర్తిస్థాయిలో అమలుచేస్తారు. ఈ అవకాశాన్ని శ్రీవారి సేవకులు వినియోగించుకోవాలని కోరడమైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.