Srivari Sevaks are Atma Bandhus of Balaji: Bapiraju _ శ్రీవారి సేవకులు అలిపిరి వరకే కుటుంబ సభ్యులు తిరుమలలో భగవంతుని ఆత్మబంధువులు : తితిదే ఛైర్మన్‌ శ్రీ కనుమూరు బాపిరాజు

Tirumala, Oct 5: The TTD Chairman Sri K Bapiraju said that Srivari Sevaks were the Atma Bandhus of Lord Venkateswara and the bridge between the deity and the devotees.

Addressing the Disha-Nirdesham session of the Srivari Sevaks at the Asthana Mandapam the chairman said Srivari Sevaks had a major role to play in the TTD and were the brand ambassadors of the organization and should enhance its reputation and prestige.

The EO Sri Gopal urged Srivari SEvaks to perform selflessly and ensure safety and comfortable stay of the devotees to  have darshan and beget blessings of Lord Venkateswara.

The JEO (Tirumala) K S Srinivasa Raju said that TTD had finalised plans to build a separate  complex for benefit of Srivari Sevaks at a cost of Rs.70 crore. He also advised the Srivari Sevaks to become eyes and ears of the TTD and security and inform police and vigilance of any suspicious activities or persons in the Tirumala and Tirupati where ever they work.

Among those who participated were Tirupati JEO Sri P Venkatarami Reddy, CV& SO Sri GVG Ashok Kumar, PRO Sri T Ravi, APRO Kumari Neelima.

ISSUES BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి సేవకులు అలిపిరి వరకే కుటుంబ సభ్యులు తిరుమలలో భగవంతుని ఆత్మబంధువులు : తితిదే ఛైర్మన్‌ శ్రీ కనుమూరు బాపిరాజు

తిరుమల, 05 అక్టోబరు 2013 : కుటుంబ సభ్యులతో వస్తున్న శ్రీవారి సేవకులకు అలిపిరి వరకే బంధాలు ఉండాలని, తిరుమలకు చేరుకున్నాక అందరూ భగవంతుని ఆత్మబంధువులుగా మారిపోయి భక్తులకు సేవలందించాలని తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు వచ్చిన శ్రీవారి సేవకులను ఉద్దేశించి తిరుమలలోని ఆస్థానమండపంలో శనివారం ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి సేవకులు భక్తులందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించాలన్నారు. తిరుమల కొండల్లో నెలవైన రాళ్లురప్పలకు, చెట్టు పుట్టకు కూడా ఎంతో పవిత్రత ఉంటుందని, అలాంటిది స్వామివారి సన్నిధిలో సేవ చేసే అవకాశం రావడం కోటిజన్మల పుణ్యఫలమని అన్నారు. కుటుంబ పాలన, పిల్లల పెంపకం లాంటి కష్టమైన పనులు చేసే మహిళలకు ఇక్కడ క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధీకరించడం చాలా తేలికన్నారు.

తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్‌ ప్రసంగిస్తూ భగవంతుని సేవ, భాగవతుల సేవ, భక్తుల సేవ చేస్తే ఎంతో పుణ్యమన్నారు. తితిదే ఉద్యోగులకు సమానంగా శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నట్టు కొనియాడారు. తిరుమలలో సేవాకాలాన్ని ఒక దీక్షగా భావిస్తే ఎలాంటి అపవాదులు వచ్చే అవకాశం ఉండదని సూచించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థ సేవలందిస్తున్న సేవకులకు శ్రీవారి ఆశీర్వాదం తప్పక ఉంటుందన్నారు.

తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తిరుమలలో ఇదివరకెన్నడూ లేని విధంగా రూ.70 కోట్లతో శ్రీవారి సేవకులకు వసతి భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. శ్రీవారిసేవకు మహిళల సంఖ్య పెరగడం స్వాగతించదగ్గ విషయమని, వీరు సున్నితత్వంతో నాణ్యమైన సేవలు అందిస్తారని వివరించారు. భక్తులకు దగ్గరగా ఉండే శ్రీవారి సేవకులు భద్రతా విషయాలపైనా దృష్టి పెట్టాలని, అనుమానిత వస్తువులు, వ్యక్తులను గుర్తిస్తే వెంటనే విజిలెన్స్‌, పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.

తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీవారి సేవ స్వామిభక్తికి పరాకాష్ట అన్నారు. శ్రీవారి సేవను మహద్భాగ్యంగా భావించి స్వామివారికి ప్రీతిపాత్రమైన భక్తులకు సేవలందించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యూలైన్లలో, గ్యాలరీల్లో భక్తులెవరైనా అసహనం ప్రదర్శిస్తే శ్రీవారి సేవకులు సహనంతో సేవలందించాలని సూచించారు.
ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ ప్రసంగిస్తూ శ్రీవారి సేవకులు పోలీసులకు, భక్తులకు మధ్య వారధిలా వ్యవహరించాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం లాంటి ప్రముఖ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులకు, విజిలెన్స్‌ సిబ్బందికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే ప్రజాసంబంధాల అధికారి శ్రీ తలారి రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 3400 మందికిపైగా శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.