TTD CHAIRMAN INAUGURATES MEDIA CENTRE _ మీడియా సెంటర్‌ను ప్రారంభించిన తితిదే ఛైర్మన్‌

Tirumala, October 5: TTD chairman K Bapiraju said today that the media had a special role to perform in the coverage of the Brahmotsavam -2013 in view of the ongoing difficult conditions for devotees to come to Tirumala.

Inaugurating the media centre for facilitating the reporters of both electronic and print media the chairman r appealed to all reporters to ensure full coverage of all events for the benefit of thousands of devotees who were unable to reach Tirumala and participate in the Brahmotsavam events due to inconveniences.

He said the scribes were lucky to be witnessing the historic and most austere events at Tirumala and should share their experiences with entire world.  They should write about Lord Venkateswara’s glory and also ensure devotees of all sections get benefit of his blessings.

Earlier the TTD Pro Sri T Ravi briefed about the facilities – computers with internet, fax and telephones before arrangements made for breakfast, lunch and dinner to convey the happenings, processions and rituals at Srivari Temple for the benefit of the devotees across the world. As many as 3400 Srivari Sevaks were participating in the Brahmotsavam events this year

Sri M G  Gopal, executive officer of the TTD said that a toll free number: 1800-425-1111 has also be pressed into service to provide information to all about the facilities- accommodation, darshan hours and also other dharmic and cultural activities at Tirumala and Tirupati.

Among those who participated were Tirupati JEO Sri P Venkatarami Reddy, CV& SO Sri GVG Ashok Kumar, Pro Sri T Ravi, APRO Kumari Neelima.

ISSUES BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన తితిదే ఛైర్మన్‌

తిరుమల, 05 అక్టోబరు 2013 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని రాంభగీచా అతిథిగృహం-2లో  ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంజి.గోపాల్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ ప్రసంగిస్తూ బ్రహ్మోత్సవాల వాహనసేవలు, ఇతర విశేషాల ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించి స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయాలని కోరారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు వార్తల సేకరణ సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త వహించాలన్నారు. మీడియా ప్రతినిధులు నిరంతరం స్వామివారి క్షేత్రంలోనే ఉండి విధులు నిర్వహించడం వారి అదృష్టమన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహనసేవలను తిలకించాలని కోరారు.

తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్‌ ప్రసంగిస్తూ భక్తులు దివ్యానుభూతి పొందేలా మీడియా ప్రతినిధులు వార్తలను ప్రసారం చేయాలని కోరారు. మీడియా సెంటర్‌లో ఇంటర్నెట్‌, భోజన వసతి, ఇతర కాటేజీల్లో బస కల్పించినట్టు వివరించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులు ఏవైనా ఫిర్యాదులు, సూచనలు, సలహాలు అందించాలంటే టోల్‌ఫ్రీ నంబరు : 1800425111111కు ఫోన్‌ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

అంతకుముందు నారాయణగిరి కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన పలు ప్రదర్శనలను తితిదే ఛైర్మన్‌, ఈవో ప్రారంభించారు. ఇందులో తితిదే ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌, గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫలపుష్ప ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వనమూలికా ప్రదర్శన, ఆయర్వేద వైజ్ఞానిక ప్రదర్శన, ఎస్వీ మ్యూజియం ప్రదర్శన, శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిల్పకళా ప్రదర్శన, ప్రత్యేక గ్రంథ ప్రదర్శన, విక్రయశాల కొలువుదీరాయి. పుష్పప్రదర్శనలో భాగంగా ఏర్పాటుచేసి సీతా స్వయంవరం, ద్రౌపతి వస్త్రాపహరణం, శ్రీరామాంజనేయ యుద్ధం, పురాణాలకు సంబంధించిన వివిధ దేవతామూర్తులు, కాయగూరలతో చేసిన దేవతామూర్తులు, పలు జాతులకు చెందిన రంగురంగుల పుష్పాలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి పాముల రాజేశ్వరి, తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.