SRIVARI SEVAKULU SERVICES TO BE EXTENDED IN RECEPTION WING ALSO_ వసతి కల్పన విభాగంలోనూ శ్రీవారి సేవకుల సేవలు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు

Tirumala, 20 February 2018: The Services of Srvari sevakulu will be henceforth extended to reception wing TTD also, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

After the weekly Senior Officers’ review meeting at Annamaiah Bhavan in Tirumala, speaking to media persons, the JEO said, the services of srivari sevakulu will be initially utilised in ANC area which will be extended to other disbursed cottages by month end. A committee was constituted on the rationalisation of office sub-ordinates”, he added.

Speaking further the JEO said, to extract qualitative services from Srivari sevakulu, the ratinalization of srivari sevakulu is underway. “The user departments of TTD are coming out with exact requirement with concrete srivari seva man power deployment for 100 rush days, 15 days peak days which includes Brahmotsavams, Vaikuntha Ekadasi, dwadasi and Radhasaptami, and 250 normal days. A committee was constituted to come out with exact manpowe requirement of sevakulu”, he maintained.

The JEO said, to study the dittam and method of Laddu preparation a committee with senior officers’ have also been constituted who will submit a report shortly on the necessary improvements that can be brought to enhance the taste of Laddu.

He said, under the instructions of TTD EO Sri Anil Kumar Singhal the works of Slotted Sarva Darshan ( SSD ) counters are going on a fast pace. “These counters will become functional from second fortnight of March”, JEO added.

FACAO Sri O Balaji, CE Sri Chandrasekhar Reddy and other senior officers were also present in the meeting.

JEO INSPECTS PRASADAM COUNTERS

After the review meeting Tirumala JEO along with CE and FACAO inspected additional prasadam counters inside Tirumala temple.

SE Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy, Temple DyEO Sri Haridranath were also present.

Later the JEO also reviewed on SSD Counters with TTD IT wing, TCS experts and APONLINE Team at Annamayya Bhavan.

HoD IT wing Sri Sesha Reddy, TCS CIO Sri Sudhakar Bhaskaruni, Sri Bheem Sekhar, Sri Satya, AP ONLINE Chief Sri Satish Kumar were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వసతి కల్పన విభాగంలోనూ శ్రీవారి సేవకుల సేవలు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు

ఫిబ్రవరి 20, తిరుమల, 2018: కాటేజీల్లో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు వసతి కల్పన విభాగంలోనూ ఇకపై శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామని టిటిడి తిరుమల జెఈవో శ్రీకెఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్‌ అధికారులతో జెఈవో వారపు సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో మొదటగా అంజనాద్రి నగర్‌ కాటేజీ ప్రాంతంలో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామని, ఈ నెలాఖరు నాటికి ఇతర కాటేజీలకు విస్తరిస్తామని తెలిపారు. కాటేజీల్లో అటెండర్ల సంఖ్యను నిర్ధారించేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి సేవకుల నుంచి మరింత మెరుగైన సేవలను పొందేందుకు విధివిధాలను రూపొందిస్తున్నామని తెలిపారు. సంవత్సరంలో 100 రద్దీ రోజులు, బ్రహ్మూెత్సవాలు, వైకుంఠఏకాదశి, ద్వాదశి, రథసప్తమి లాంటి 15 ముఖ్యమైన రోజులు, 250 సాధారణ రోజులలో ఆయా విభాగాలకు అవసరమైన శ్రీవారి సేవకుల సంఖ్యను అధికారులు నిర్థారిస్తున్నారని చెప్పారు. ఆయా విభాగాలకు శ్రీవారి సేవకుల కేటాయింపునకు సంబంధించి ఒక కమిటీని రూపొందించినట్లు తెలిపారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను, రుచిని మరింత పెంచేందుకు సీనియర్‌ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, దిట్టం, లడ్డూ తయారీ విధానాన్ని అధికారులు అధ్యయనం చేస్తారని జెఈవో తెలిపారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్ల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మార్చి రెండో పక్షంలో ప్రారంభిస్తామని వివరించారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో అదనపు ప్రసాదం కౌంటర్‌ ఏర్పాటు

శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత వేగంగా అన్నప్రసాదాలను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్‌ను మంగళవారం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా అన్నప్రసాదాలు అందించాలని ఆలయ అధికారులకు సూచించారు. జెఈవో వెంట ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ. బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు ఉన్నారు.

అనంతరం సర్వదర్శన టైంస్లాట్‌ కౌంటర్ల పనుల పురోగతిపై టిటిడి ఐటీ, టిసిఎస్‌ అధికారులతో జెఈవో సమీక్షించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.