PRANAYAMAM COMMENCED FOR SRIVARI SEVAKS ON YOGA DAY- శ్రీవారి సేవకులకు ప్రాణాయామంలో శిక్షణ

Tirumala, 21 June 2017: In connection with International Yoga Day on Wednesday, the Srivari Sevakulu have been trained in “Pranayamam” – control of Breath which is a vital state of Yoga Sutra.

Taking the call given by TTD EO Sri Anil Kumar Singhal who instructed the Srivari Seva wing and Satya Sai Satsang trainers to include pranayama also in Srivari Seva daily training program which keeps the body and mind healthy, the most powerful breathing yogic technique has been taught to sevakulu during the satsang program in Srivari Seva Sadan on Wednesday in Tirumala.

Over 750 sevakulu hailing from all southern states of India took part in this program which will be henceforth continued in both morning and evening training sessions.

Assistant PRO Ms P Neelima, OSD Sri VLN Prasad, AE Sri Varaprasad and other trainers were also present. ”


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవకులకు ప్రాణాయామంలో శిక్షణ

తిరుమల, 2017, జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో శ్రీవారి సేవకులకు ప్రాణాయామంలో శిక్షణను ప్రారంభించారు. సేవకుల్లో ఏకాగ్రతను పెంచి మరింత మెరుగ్గా భక్తులకు సేవలందించేందుకు వీలుగా ప్రాణాయామంలో శిక్షణ ఇచ్చారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచనల మేరకు ఇకపై ప్రతిరోజూ శ్రీవారి సేవకులకు ప్రాణాయామంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదివరకే శ్రీ సత్యసాయి సేవా సంస్థ సహకారంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సేవకులకు సత్సంగం, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఓఎస్‌డి శ్రీ విఎల్‌ఎన్‌.ప్రసాద్‌, ఏఇ శ్రీ వరప్రసాద్‌, ఇతర అధికారులు, సిబ్బంది, దక్షిణాది రాష్ట్రాల నుంచి విచ్చేసిన 750 మందికిపైగా శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.