SRIVARI TEMPLE DOOR CLOSES FOR SOLAR ECLIPSE _ సూర్యగ్రహణం కార‌ణంగా రాత్రి 11 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

Tirumala, 25 Dec. 19: The doors of Srivari Temple were closed on Wednesday at 11pm and will be re-opened at 12noon on December 26 in view of Solar eclipse on Thursday between 8:08am till 11:16am. 

It is a temple tradition to close the temple doors at least six hours before the eclipse. So the temple doors will be closed at 11pm on December 25.

The darshan for devotees and distribution of Annaprasadam for devotees will commence only by 2:30pm after Grahana Suddhi activities both at the temple and also in massive annaprasadam kitchen respectively.

To facilitate smooth and early darshan to common devotees, the TTD has cancelled all privilege darshans, VIP break including Protocol, arjitha sevas  on Thursday.

The devotees will be let into the compartments of Vaikuntam Queue complex only after 12noon.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

సూర్యగ్రహణం కార‌ణంగా రాత్రి 11 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

డిసెంబ‌రు 26న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభం

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుండి అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 25: సూర్యగ్రహణం కారణంగా బుధ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యార్థం గురువారం విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను(ప్రోటోకాల్ ద‌ర్శ‌నాలు కూడా) ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

గురువారం ఉదయం 8.08 గంట‌ల నుండి ఉదయం 11.16 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అనగా బుధ‌వారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం త‌లుపులు మూస్తారు. గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు తెరుస్తారు. ఆలయశుద్ధి అనంత‌రం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది. ఇందుకోసం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌రువాత భ‌క్తుల‌ను కంపార్ట్‌మెంట్ల‌లోకి అనుమ‌తిస్తారు.

అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం మూత

గ్ర‌హ‌ణం కార‌ణంగా బుధ‌వారం రాత్రి 11 గంట‌లకు మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును మూసివేస్తారు. గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఈ భ‌వ‌నాన్ని తెరుస్తారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా డిసెంబ‌రు 26న తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, వ‌సంతోత్స‌వం ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.