SRIVARI VASANTHOTSAVAM FROM APRIL 24-26 _ ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
Tirumala, 20 April 2021: TTD is organising three-day fete of annual Vasantotsavam at Srivari Temple from April 24-26 in Ekantham in view of Covid guidelines.
As part of the of the festival conducted in the spring season Sri Malayappa Swami is worshipped with flowers and assorted fruits.
Daily Snapana Tirumanjanam for utsava idols of Sri Malayappa Swami and His consorts will be performed in the morning and procession along Mada streets in the evening.
TTD has cancelled Swarna Ratham procession in view of Covid on second day of annual brahmotsavams.
On the third day the parivara devatas of Sri Sita – Rama – Lakshmana – Anjaneya, Rukmini – Sri Krishna are also offered Snapana Tirumanjanam along with Malayappa, Sridevi and Bhudevi.
As part of festivities, TTD has cancelled the arjita sevas (virtual) including Kalyanotsavam, Unjal Seva, and Arjitha Brahmotsavam and Sahasra Deepalankara seva on all these three days.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల, 20 ఏప్రిల్ 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా రెండో రోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను స్వామికి నివేదిస్తారు.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. మొదటి రెండు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, ఊరేగింపు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల కారణంగా మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.