SRIVARU PRESENTS ORNAMENTS TO SRI RAMA _ కోదండ రామునికి శ్రీవారి బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు

Vontimitta, 22 April 2024: TTD EO Sri AV Dharma Reddy has Presented ornaments comprising jewels and Puja Utensils to Vontimitta Kodanda Ramalayam from Tirumala Sri Venkateswara Swamy on Monday evening.

On the celestial occasion of Sri Sita Rama Kalyanam, a total of 13 ornaments worth nearly Rs.31lakhs have been presented.

The following are the list of ornaments.

Gold Necklace with Lakshmi Patakam – Rs.1. 82lakhs

Navratna Beads Gold Necklace – 

Rs. 2.28lakhs

Lakshmi Patakam – Rs.4.25lakhs

Pearl necklace with gold Patakam -Rs. 14lakhs

Two Silver Panchamukha Dipa Stambhams-Rs. 6.5lakhs

One Silver Plate, five silver vessels, One silver Udharini worth-Rs. 2.20lakhs

Gold ornaments weighed about half a kilo and silver over 13 Kilos presented on the occasion.

JEOs Smt Goutami, Sri Veerabrahmam, DyEOs Sri Natesh Babu, Sri Lokanatham and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కోదండ రామునికి శ్రీవారి బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 22: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు దాదాపు రూ.31 లక్షల విలువగల సుమారు 512 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు, 14 కేజీల వెండి పూజా సామాగ్రి, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సోమవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆలయానికి అందజేశారు.

ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని ఈవో ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్ళి అర్చకులకు అందజేశారు.

కోదండరామాలయంలోని మూల మూర్తికి, ఉత్సవ మూర్తులకు రెండు లక్ష్మీ పతకాలు, రెండు పేటల నవరత్న పూసల హారము, బంగారు పతకము కలిగిన ముత్యాల హారము శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. అదేవిధంగా రెండు వెండి పంచముఖ దీపస్తంభములు, ఐదు వెండి గిన్నెలు, ఒక వెండి తట్ట, ఒక ఉద్దరిని కూడా అందింది.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీ వీర బ్రహ్మం, శ్రీమతి గౌతమి, డిప్యూటీ ఈవో శ్రీ నటేశ్ బాబు, విజివో శ్రీ బాలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది