TTD SCHOOLS RECORD 98% PASS PERCENTAGE _ పదో తరగతి పరీక్ష ఫలితాలలో టీటీడీ పాఠశాలల విజయ దుందుభి

 – EO, JEO(E &H), DEO CONGRATULATE STUDENTS AND TEACHERS

Tirupati, 22 April 2024: The TTD Educational Institutions have registered 98% pass percentage in Tenth results ringing the Victory Bell.

The TTD management has provided good facilities and the officers and teachers have given special attention to education and the best results have been achieved.

TTD General Schools have an average pass percentage of 98%.  Tirupati and Bhimavaram deaf schools achieved 100 percent results.

Competing with corporate schools, students scored 589,585,582 marks in Sri Venkateswara High School, Tirupati and 585,583,582 marks in Sri Kodanda Ramaswamy English Medium High School.  Students of Tirumala Sri Venkateswara High School secured 581 marks and further enhanced the prestige of TTD school.

SV Deaf and Dumb School in Tirupati, Bhimavaram achieved 100 percent pass.

TTD EO Sri AV Dharma Reddy, Joint Executive Officer (Education, Medical) Smt. Gauthami, TTD Education Officer Dr M Bhaskar Reddy lauded the principals, teachers and the outstanding students.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పదో తరగతి పరీక్ష ఫలితాలలో టీటీడీ పాఠశాలల విజయ దుందుభి

– విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించిన ఈవో, జేఈవో, డీఈవో


తిరుపతి 22 ఏప్రిల్ 2024: ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో టీటీడీ విద్యా సంస్ధలు విజయ దుందుభి మోగించాయి. టీటీడీ యాజమాన్యం చక్కటి వసతులు కల్పించడం, అధికారులు, ఉపాధ్యాయులు భోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయి.

టీటీడీ జనరల్ పాఠశాలలు సరాసరి 98% ఉత్తీర్ణత సాధించాయి. తిరుపతి, భీమవరం బధిర పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.

కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడి తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర హై స్కూల్ లో589,585,582 మార్కులు, శ్రీ కోదండ రామస్వామి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 585,583,582 మార్కులు విద్యార్థులు సాధించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర హై స్కూల్ విద్యార్థులు 581 మార్కులు సాధించి టీటీడీ పాఠశాల ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు.

తిరుపతి, భీమవరం లోని ఎస్వీ బధిర పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి
విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభకు కారకులైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, సంయుక్త కార్యనిర్వహణాధికారిణి (విద్య, వైద్యం) శ్రీమతి గౌతమి టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి అభినందించారు

పాఠశాలల వారీగా ఫలితాల శాతం, అత్యధిక మార్కులు..

ఎస్వీ హైస్కూల్ తిరుపతి
97 శాతం. అత్యధిక మార్కులు 589

శ్రీ కోదండరామస్వామి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తిరుపతి
96 శాతం
అత్యదిక మార్కులు 585

ఎస్వీ హైస్కూల్ తిరుమల 100 శాతం అత్యధిక మార్కులు 581

ఎస్ పి బాలికల హైస్కూల్ తిరుపతి 96 శాతం అత్యధిక మార్కులు 578

ఎస్ జి ఎస్ హైస్కూల్ తిరుపతి 98 శాతం అత్యధిక మార్కులు 574
ఎస్ వీ ఓరియంటల్ హైస్కూల్ తిరుపతి 100 శాతం అత్యధిక మార్కులు 553

ఎస్ కె ఎస్ హైస్కూల్ తాటితోపు 96 శాతం అత్యధిక మార్కులు 543

ఎస్ వీ బధిర పాఠశాల తిరుపతి 100 శాతం అత్యధిక మార్కులు 358/400

ఎస్వీ బధిర పాఠశాల భీమవరం 100 శాతం అత్యధిక మార్కులు 309/ 400

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది