SRIVINIVASA VEDA VIDWAT SADAS TO STAND AS SPECIAL ATTRACTION DURING ANNUAL FETE_ సెప్టెంబ‌రు 30 నుండి తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో శ్రీ శ్రీ‌నివాస‌ వేద విద్వ‌త్ స‌ద‌స్సు

Tirumala, 25 Sep. 19: Sri Venkateswara Higher Vedic Studies wing of TTD has mulled a scholarly programme during the nine-day annual brahmotsavams which will be conducted at Asthana Mandapam in Tirumala with stalwarts from Vedic literature rendering lectures.

Some renowned scholars including Prof.KE Devanathan, Dr VR Panchamukhi, Acharya Ghiasis Guruji, Dr Dharmendra Kumar, Prof. Vempati Kutumbha Shastry, Prof. Chirravari Sreerama Sharma, Prof. Viroopaksha V Jaddipal, famous spiritual scholars from Tamilnadu including Acharya Vellukudi Krishnan, Acharya Ananta Padmanabhan will be giving lectures.

Interesting topics including importance of vedas in society, Purusharthas as per vedas, Lord Venkateswara Tatwam in Vedas, Bhagavatgita in Vedas, Vedic Dharma and many more.

From September 30 till October 6, these lectures will be conducted between 7.30am and 8.30am while on October 7 and 8 it will be between 10.30am and 11.30am due to Rathotsavam and Chakrasnanam respectively.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 30 నుండి తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో శ్రీ శ్రీ‌నివాస‌ వేద విద్వ‌త్ స‌ద‌స్సు

తిరుమ‌ల‌, 2019 సెప్టెంబ‌రు 24: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేద అధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌రు 30 నుండి ఆక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు తిరుమ‌లలోని ఆస్థాన మండ‌పంలో ప్ర‌ముఖ పండితుల‌తో శ్రీ‌శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం ఉద‌యం 6.30 నుడి 7.30 గంట‌ల వ‌ర‌కు చ‌తుర్వేద పారాయ‌ణం, ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు దేశంలోని ప్ర‌ముఖు పండితుల‌తో వేద విజ్ఞ‌నంపై స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా అక్టోబరు 7 మ‌రియు 8వ తేదీలలో న రథోత్సవం మరియు చక్రస్నానం కార‌ణంగా ఉదయం 10.30 మరియు 11.30 గంటల మధ్య ఉంటుంది.

సెప్టెంబ‌రు 30న తిరుప‌తికి చెందిన ఆచార్య కె.ఇ.దేవ‌నాథ‌న్ (వేదాల్లోని పురుషార్థ‌లు), అక్టోబ‌రు 1న ఉజ్జ‌యినికి చెందిన ఆచార్య విరుపాక్ష ( స‌మాజానికి అవ‌స‌ర‌మైన వేద‌భాష్యం), అక్టోబ‌రు 2న చెన్నైకి చెందిన ఆచార్య శ్రీ ముకుంద‌గిరి వెంకీపురం అనంత ప‌ద్మ‌నాభ ఆచార్య స్వామి (వేదాల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర త‌త్వం), అక్టోబ‌రు 3న శ్రీ‌రంగంకు చెందిన ఆచార్య వి. శ్రీ కృష్ణ‌స్వామి (వేదాల్లోని క‌థ‌లు – నేటి స‌మాజానికి దిశ నిర్ధేశం), అక్టోబ‌రు 4న పుణెకు చెందిన ఆచార్య మోరేశ్వ‌ర్ ఘైసాస్ (ప్ర‌పంచ శాంతిలో వేదాల పాత్ర‌), అక్టోబ‌రు 5న తిరుప‌తికి చెందిన ఆచార్య వి.ఆర్ పంచ‌ముఖి (వేదాల‌లో భాగ‌వ‌ద్గీత సారం), అక్టోబ‌రు 6న ఢిల్లీకి చెందిన డాక్ట‌ర్ ధ‌ర్మేద్ర కుమార్ (వేదాల్లోని ధ‌ర్మ‌లు – నేటి స‌మాజం), అక్టోబ‌రు 7న రాజ‌మండ్రికి చెందిన ఆచార్య సి.శ్రీ‌రామ‌శ‌ర్మ (వేదాల్లోని పంచ‌ద‌శ సంస్కారాలు), అక్టోబ‌రు 8న పుణెకు చెందిన ఆచార్య వి.కుటుంబ శాస్త్రీ (వేద విజ్ఞానంలోని క‌థోప‌నిష‌త్తు ప్ర‌ముఖ్య‌త‌) త‌దిత‌ర అంశాల‌పై ఉప‌న్యాసించ‌నున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.