SSD COUNTERS OPENS ON TRIAL BASIS IN TIRUMALA_ ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

PILGRIMS GIVES THUMBS UP TO THE SYSTEM SSD SYSTEM

TTD PUBLICITY MECHANISM REACHES PILGRIMS IN DIFFERENT QUARTERS

TANJORE WOMAN GETS FIRST TOKEN FOR DARSHAN

Tirumala, 18 December 2017: The prestigious epic scheme, Slot wise Sarva Darshan (SSD) counters opens up on Monday on trial basis amidst lot of appreciation from pilgrim circles.

GOD IS GREAT-PILGRIM

When Smt Shakuntala and her friends expressed their pleasure for having received the first darshan token in their choice of 2pm slot, the joy of one Sri Vijay Kumar and his family of five from Hyderabad knew no bounds when he said that they have missed their Rs.300 special entry darshan on Sunday as they reached Tirumala beyond the given time on the token. “We are from agriculture family. We were very sad when we reached Tirumala late on Sunday. But see the mercy of Lord, he has given us the darshan today through SSD and we booked 11am slot. Thanks to TTD mandarins as we finished darshan in couple of hours”, an elated Vijay Kumar said.

GOT TO KNOW THROUGH MY FACE BOOK FRIENDS: Hemanth Kumar of Mahbubnagar said he got to know about the information on SSD through his face book friends. Another devotee from Vizianagaram, Sri B Yellaji said they came know from print and electronic media. “I just came to see how the new system works. It’s 100 per cent beneficiary for the pilgrims who are forced to wait in long hours in queue lines and compartments. Thanks to the efforts of TTD for this pilgrim friendly initiative. When go back to my home turf I inform all my friends about this – Carry your Aadhaar Card and get the easy free darshan of Lord Venkateswara”, he asserted with jubiliation.

WIDE PUBLICITY YIELDS RESULTS

The wide publicity taken up by TTD under the instructions of TTD EO Sri Anil Kumar Singhal in the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju in the past fortnight yielded good results. The temple management has given enormous publicity through media, website, newspaper advertisements, SVBC scrolling, distribution of pamphlets in Telugu, Tamil, Kannada, Hindi and English to pilgrims at RTC bus stand, railway station, Alipiri toll gate. Apart from this some pilgrim and media groups passed the information across the nation with the help of social media which has received overwhelming response from the pilgrims located in all corners of the country.

JEO PERFORMS PUJA TO CRO SSD COUNTER

Earlier during the day, Tirumala JEO Sri KS Sreenivasa Raju performed puja at CRO SSD and commenced the token issuing activity on Monday by 5:50am.

TTD has deployed about 500 employees for SSD in all 14 locations which includes two footpath routes also. Srivari Seva volunteers are also deployed to man the queue lines in all 117 counters.

CVSO Sri A Ravikrishna, SE II Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy, SE Electrical Sri Venkateswarulu, DyEO Annaprasadam Sri Venugopal, VGO Sri Ravindra Reddy.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

సిఆర్‌వో వద్దగల కౌంటర్లలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పూజలు

డిసెంబరు 18, తిరుమల 2017: తిరుమలలో సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం ప్రారంభమైంది. టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు సోమవారం ఉదయం 6 గంటలకు సిఆర్‌వో వద్ద గల కౌంటర్లలో పూజలు నిర్వహించి టోకెన్ల జారీని ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన శకుంతలారామన్‌ అనే భక్తురాలి ఆధార్‌కార్డును స్కాన్‌ చేసి మొదటి టోకెన్‌ అందజేశారు.

సమయ నిర్దేశిత సర్వదర్శనం కోసం భక్తులు తప్పనిసరిగా ఆయా కౌంటర్ల వద్ద ఆధార్‌కార్డు చూపాల్సి ఉంటుంది. కౌంటర్ల వద్ద ఖాళీగా ఉన్న స్లాట్ల వివరాలను భక్తులు తెలుసుకునేందుకు వీలుగా మానిటర్లను ఏర్పాటుచేశారు. భక్తులు 24 గంటల వ్యవధిలో ఖాళీగా ఉన్న స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. టోకెన్‌ పొందిన అనంతరం అందులో సూచించిన సమయానికి ఎటిసి కార్‌ పార్కింగ్‌ ప్రదేశంలోని దివ్యదర్శనం కాంప్లెక్స్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టోకెన్లు తనిఖీ చేసి రూ.10/- చొప్పున 2, రూ.25/- చొప్పున 2 లడ్డూ టోకెన్లు అందిస్తారు. రెండు గంటల్లోపు స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఆధార్‌కార్డులు లేని భక్తులు పాత పద్ధతిలో సర్వదర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

తిరుమలలో టోకెన్ల జారీ కేంద్రాలు :

కేంద్రీయ విచారణ కార్యాలయం, సప్తగిరి సత్రాలు, కౌస్తుభం విశ్రాంతిగృహం, సన్నిధానం, ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి నగర్‌ కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ కౌంటర్‌, ఎంబిసి-26 లగేజి కౌంటర్‌, ఎటిసి, శ్రీ వరాహస్వామి, నందకం విశ్రాంతి సముదాయాలు, కల్యాణవేదిక, గాలిగోపురం, శ్రీవారిమెట్టు మార్గం, ఆళ్వారుట్యాంక్‌ వద్ద టోకెన్ల జారీ కౌంటర్లు ఉన్నాయి.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తుల మనోగతం :

సర్వదర్శనం టోకెన్లు పొందిన పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన రైతు విజయకుమార్‌ మాట్లాడుతూ డిసెంబరు 17న రూ.300/- దర్శన టికెట్‌ బుక్‌ చేసుకున్నామని, అనివార్య కారణాల వల్ల శ్రీవారి దర్శనం చేసుకోలేకపోయామని చెప్పారు. తిరుమలలో రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ వారి ప్రకటనలు విని సోమవారం ఉదయం ఆధార్‌ కార్డులు చూపించి మొత్తం 5గురు కుటుంబ సభ్యులకు టోకెన్లు పొందామన్నారు. భగవంతుడు ఇచ్చిన మరో అవకాశంగా భావించి ఉదయం 11 గంటల స్లాట్‌ను బుక్‌ చేసుకున్నట్టు తెలిపారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ తిరుపతి నుంచి తిరుమలకు బస్‌లో వస్తుండగా అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద శ్రీవారి సేవకులు కరపత్రాలు అందించారని తెలిపారు. కరపత్రాల ద్వారా విషయం తెలుసుకుని సర్వదర్శనం టోకెన్లు పొందామన్నారు. నిర్మల్‌కు చెందిన బి.మహేష్‌ మాట్లాడుతూ పత్రికల్లో వార్తలు చూసి సమయ నిర్దేశిత సర్వదర్శనానికి వచ్చినట్టు తెలిపారు. టివి చానళ్లలో కథనాల ద్వారా సర్వదర్వనం టోకెన్ల విషయాన్ని తెలుసుకుని వచ్చామని విజయనగరానికి చెందిన బి.యల్లాజి అనే భక్తురాలు చెప్పారు. తమిళనాడులోని కరూర్‌కు చెందిన రవిచంద్రన్‌ అనే భక్తుడు మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లో మిత్రులు అందించిన సమాచారం మేరకు తిరుమలకు సమయ నిర్దేశిత సర్వదర్శనానికి వచ్చినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవిక ష్ణ, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీవేణుగోపాల్‌ ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.