SSD TOKENS ON JAN 10: ADDITIONAL EO _ జనవరి 10వ తేదీ స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత దర్శనం టికెట్ల జారీ
Tirupati, 08 JANUARY 2022: The SSD tokens for Vaikunta Dwara Darshanam will be issued to locals at five counters in Tirupati on January 10 from 9am onwards, said TTD Additional EO Sri AV Dharma Reddy.
After inspecting all the counters in Tirupati on Sunday, speaking at TMC he said in view of increasing Omicron cases, TTD has decided to issue tokens only to locals at five places including MR Palle ZP High School, Ramanaidu Municipal High School, Municipal Corporation, Jeevakona ZP High School and Ramachandra Pushkarini.
The tokens will be issued in all these counters continuously till all the 50000 tickets for ten days gets exhausted, he added.
The devotees will be allowed to enter Tirumala only on the previous day after 2pm for his darshan on next day. The devotees are requested to follow all the Covid norms and come for darshan, he maintained.
CE Sri Nageswara Rao, Chief Information Officer Sri Sandeep Reddy were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 10వ తేదీ స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత దర్శనం టికెట్ల జారీ
– భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
– తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి
తిరుపతి 8 జనవరి 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తెలిపారు.
తిరుపతి లోని రామచంద్రపుష్కరిణి, ముత్యాలరెడ్డి పల్లె, సత్యనారాయణ పురం జిల్లా పరిషత్ పాఠశాలలు, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. టికెట్ల కోసం వచ్చే భక్తులు క్యూ లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శ్రీ ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. టికెట్లు పొందిన భక్తులు ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రమే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు.
చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, సి ఐ ఓ శ్రీ సందీప్ పాల్గొన్నారు
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది