TTD AND TIRUMALA COPS MEETING HELD _ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సివిఎస్వో, అర్బన్ ఎస్పీ సమీక్ష
Tirumala, 8 Jan. 22: In connection with the ensuing Vaikunta Ekadasi, a coordination meeting between TTD cops and Tirumala police was held at Annamaiah Bhavan on Saturday.
Both TTD CVSO Sri Gopinath Jatti and Tirupati Urban SP Sri Venkatappala Naidu discussed in elaborate about the arrangements to me made for the ten-day Vaikunta Dwara Darshanam with a special focus on Vaikunta Ekadasi and Dwadasi.
The meeting deliberated on how to ensure hassle-free darshanam to the devotees, proper traffic management, coordination with the reception wing etc.
They also discussed in length on Bundo bust to be made at SSD counters in Tirupati and also at footpath route.
VGO Sri Bali Reddy, SDPO Sri Prabhakar, AVSOs Sri Surendra, Sri Veerababu, Sri Pawan Kumar, Sri Sivaiah, Sri Padmanabhan, CIs Sri Jaganmohan Reddy, Sri Chandrasekhar and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సివిఎస్వో, అర్బన్ ఎస్పీ సమీక్ష
తిరుమల, 2022 జనవరి 08: తిరుమలలో జనవరి 13న వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీశ్రీ వెంకటప్పల నాయుడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సమీక్ష నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు ప్రత్యేక దృష్టి సారించి పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం, ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించడం, రిసెప్షన్ విభాగాల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
తిరుపతిలోని ఎస్‌ఎస్‌డి కౌంటర్ల వద్ద, ఫుట్‌పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో విజివో శ్రీ బాలిరెడ్డి, ఎస్‌డిపిఓ శ్రీ ప్రభాకర్, ఎవిఎస్వోలు శ్రీ సురేంద్ర, శ్రీ వీరబాబు, శ్రీ పవన్ కుమార్, శ్రీ శివయ్య, శ్రీ పద్మనాభన్, సిఐలు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.