STAGE SET FOR DIVINE WEDDING CEREMONY _ సీతారాముల కల్యాణ వేదిక సిద్ధం

TTD MAKES ELABORATE ARRANGEMENTS IN CO ORDINATION WITH DISTRICT AUTHORITIES

ANNAPRASADAM, WATER, BUTTERMILK ARRANGED

AIR COOLERS IN GALLERIES

LED SCREENS FOR DEVOTEES

TALAMBRALU PACKETS TO BE DISTRIBUTED AMONG DEVOTEES

VONTIMITTA, 21 APRIL 2024: All arrangements are in place for the much-awaited celestial wedding ceremony Sri Sita Rama Kalyanam to be observed at Vontimitta in YSR Kadapa district on April 22 between 6:30pm and 8:30pm.

TTD has made elaborate arrangements of food, water, electrical and floral decorations, security, Sound system and LED TVs for the sake of visiting devotees in coordination with district administration.

Security

Towards a hassle-free event, TTD has deployed its two VGOs, six AVSOs, VIs, 200 men besides 450 scouts. Apart from this 80 moving barricades, ropes, 30 megaphones, were also provided at the venue. 

Health

Sectorwise sanitary inspectors, Two maestries, one worker for each gallery have been pressed into service. Over one lakh buttermilk and four later water sachets are kept ready. Around 580 workers are deployed.

Annaprasadam 

180 workers and 100 supervisors are carrying out Annaprasadam preparation activity for the mega day. 50,000 packets each of

Lemon Rice and Chakkara Pongali

in 140 food counters will be distributed on Kalyanam day.

Electrical

The entire area has been spruced up for a big event with over three dozen electrical illuminations, 28 LED screens, a hi-fi Public Address System, over 200 Air coolers for the galleries.

Floral

Giving a traditional aesthetic feel over four tonnes of flowers including 30thousand cut flowers will be used to deck up the Kalyana Vedika. Nearly 100 workers are engaged in decorations.

Others

Talambralu will be distributed to each devotee in the gallery itself.

Annaprasadams will be provided to the devotees after Kalyanam. For this exclusive counters have been set up on both sides of the galleries.

Nearly 1500 Srivari Sevaks have been pressed into service exclusively on the day of Kalyanam to render services to visiting pilgrims.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సీతారాముల కల్యాణ వేదిక సిద్ధం

– టీటీడీ, జిల్లా అధికారుల సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు

– భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ

•⁠ ⁠గ్యాలరీలలో ఎయిర్ కూలర్లు

– భక్తుల కోసం ఎల్ఈడి స్క్రీన్లు

– భక్తులకు తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం

ఒంటిమిట్ట‌, 2024 ఏప్రిల్ 21: వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో సోమవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్నప్రసాదాలు, తాగునీరు విద్యుత్‌, పుష్పాలంకరణలు, భద్రత, సౌండ్‌ సిస్టమ్‌, ఎల్‌ఈడీ టీవీలను టీటీడీ ఏర్పాటు చేసింది.

టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా వేదిక వద్ద బారికేడ్లు, రోప్‌లు, మెగా ఫోన్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.

టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కళ్యాణ వేదిక వద్ద శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, ఒక్కో గ్యాలరీకి వర్కర్లను నియమించింది. లక్షకు పైగా మజ్జిగ, నాలుగు లక్షలకు పైగా వాటర్ పాకెట్లను సిద్ధంగా ఉంచారు. దాదాపు 580 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.

సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు 280 మంది కార్మికులు, సూపర్‌వైజర్లు రుచికరమైన అన్నప్రసాదాలు తయారు చేయనున్నారు. ఇందులో పులిహోర, చక్కర పొంగలి ఒక్కొక్కటి 50 వేల ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు. వీటిని కల్యాణం రోజున 150 అన్నప్రసాద పంపిణీ కౌంటర్లలో భక్తులకు అందిస్తారు.

ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, 28 ఎల్ ఈడి స్క్రీన్‌లు, హై-ఫై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, గ్యాలరీలలో ఉండే భక్తులకు వేసవి ఉపశమనం కోసం 200కి పైగా ఎయిర్ కూలర్‌లు ఏర్పాటు చేశారు.

కళ్యాణ వేదికను 30 వేల కట్‌ ఫ్లవర్‌లతో సహా నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలతో తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరిస్తున్నారు . దాదాపు 100 మంది నిపుణులు రెండు రోజులుగా పుష్పాలంకరణలు చేస్తున్నారు.

కళ్యాణానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసేందుకు. టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు గ్యాలరీలకు ఇరువైపులా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.