STATE-OF-ART TECHNOLOGY AND MACHINERY FOR NEW PARAKAMANI BUILDING AT TIRUMALA-TTD EO _ స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ తో కొత్త పరకామణి భవనం : అధికారులకు ఈఓ ఆదేశం
Tirupati, 31 Aug. 20: The entire building as well the machinery should be designed using State-of-Art technology for the upcoming Parakamani Building at Tirumala, said TTD EO Sri Anil Kumar Singhal.
A review meeting was held in the chambers’ of TTD Executive Officer in the Administrative Building in Tirupati on Monday along with Additional EO Sri AV Dharma Reddy on the new Parakamani Building which is in offing at Tirumala.
Chief Engineer Sri M Ramesh Reddy presented the layout design of the Parakamani Building through Power Point Presentation which will be coming up in front of the Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex (MTVAC) at Tirumala in an area of 22,622s.ft.on Donation basis at a cost of Rs.9cr. He said the Cellar has strong rooms meant for Banks while the Ground floor has Coins Parakamani Hall and strong rooms for keeping Hundis and the First Floor houses a Hall for Currency Parakamani, gold and other offerings.
EO directed the officials concerned to present a perfect plan overcoming the existing glitches of sorting, segregation, counting, security frisking, etc. “The new building should be constructed with State of Art technology and machinery and the process of Parakamani should be carried with less manpower involvement to have a more transparent and speedy counting mechanism.
He also discussed the Electrical wiring, Firefighting Measure setup, installation of Surveillance CC TVs, soundproof glass for coin counting machinery, compound wall with protective spikes, Donor Hall, Security Room etc. and instructed to take up the works at a faster pace.CVSO Sri Gopinath Jatti, FACAO Sri O Balaji, EE Sri Jagan Mohan Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ తో కొత్త పరకామణి భవనం : అధికారులకు ఈఓ ఆదేశం
తిరుపతి 31ఆగస్టు2020: తిరుమలలో అన్న ప్రసాదం కాంప్లెక్స్ ఎదుట నిర్మించనున్న పరకామణి నూతన భవనాలు, అందులోని యంత్రాలు, సదుపాయాలు, భద్రత, మౌలిక వసతులతో కలిపి స్టేట్ఆఫ్ఆర్ట్ డిజైన్ తో ఉండాలని టీటీడీ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. దాత నిర్మిస్తున్న ఈ భవనం డిజైన్, కల్పించాల్సిన వసతులపై అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి తో కలసి సోమవారం తిరుపతి పరిపాలన భవనం లోని తన చాంబర్లో ఈఓ సమీక్ష జరిపారు.
సిఈ శ్రీ రమేష్ రెడ్డి డిజైన్ లేఔట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 22,622 చదరపు అడుగుల విస్తీర్ణం లో ఈ భవనం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 9 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ భవనం సెల్లార్ లో బ్యాంకుల కోసం స్ట్రాంగ్ రూములు, గ్రౌండ్ ఫ్లోర్ లో నాణేల పరకామణి హాల్, హుండీలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం లు డిజైన్ చేసినట్లు చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ లో నోట్లు, బంగారు, ఇతర కానుకల లెక్కింపు హాల్ ఉంటాయన్నారు. నాణేల పరకామణిలో యంత్రాల శబ్దం రాకుండా సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు కూడా పరకామణి లెక్కింపు చూడవచ్చని ఆయన చెప్పారు. ఈఓ శ్రీ సింఘాల్ మాట్లాడుతూ నాణేలు వాటి విలువను బట్టి వేరు చేసే యంత్రాల ఏర్పాటు, లెక్కింపు, భద్రత, విద్యుత్, అగ్నిమాపక పరికరాలు, సిసి టివి ల ఏర్పాటు, డోనార్ హాల్, సిబ్బంది సదుపాయాల విషయాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితమైన ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యంత్రాల సహాయంతో తక్కువ మంది సిబ్బందితో పారదర్శకంగా, వేగంగా లెక్క పెట్టే వ్యవస్థ ఏర్పాటు, తనిఖీలు, పరకామణి భవనం కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ గదుల నిర్మాణం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.