STAVADHANAN, VAITALIKULU EVENTS STEAL TTD’s VILAMBI UGADI CELEBRATIONS_ విళంబినామ సంవత్సరంలో అన్నీ శుభాలే : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 18 March 2018: The unique Telugu literary fete, Asthavadhanam and the fashion dress show presented by the children of TTD employees have won the attention of audience on Sunday.
Sri Vilambi Nama Ugadi festival was observed with pomp and gaiety by TTD in Mahati auditorium in Tirupati. JEO Sri P Bhaskar graced the occasion as Chief Guest and wished that this Ugadi to prosperity in the life of everyone.
Later after Panchanga Sravanam, Astavadhanam was performed by Sri Mylavarapu Murali Krishna. Stalwarts including SO Sri N Muktheswara Rao, Dr Samudrala Lakshmanaiah, Sri Chenchusubbaiah, Sri Chennakesavulu Naidu, Sri Damodaram Naidu, Sri Hemanth Umar, Smt Tejovani, Sri Srimannarayana, Sri Parameswaraiah, Sri Reddeppa also enacted each role of Avadhana prakriya and enthralled the audience.
Later Telugu Vaitalikulu, fashion show sported by the children attracted the viewers.
The Ugadi fete was conducted jointly by HDPP and Welfare departments of TTD.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
విళంబినామ సంవత్సరంలో అన్నీ శుభాలే : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
మార్చి 18, తిరుపతి, 2018: శ్రీ విళంబినామ సంవత్సరంలో శ్రీవారి ఆశీస్సులతో అన్నీ శుభాలే కలుగుతాయని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ అన్నారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ తెలుగు జాతికి ముఖ్యమైన పండుగ ఉగాది అన్నారు. బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తోందని తెలిపారు. ఉగాది పచ్చడిలో జీవితసారం దాగి ఉందన్నారు. ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనమని, ప్రతి రుచికీ ఒక అనుభూతి ఉంటుందని అన్నారు. అనుభూతుల సమ్మేళనమే జీవితమని తెలియజేశారు. మానవజీవితం సుఖదుఃఖాల సమాహారమని, అన్నింటినీ సమభావనతో స్వీకరించి ముందుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా శ్రీ గోపావఝల బాలసుబ్రహ్మణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. విళంబినామ సంవత్సరంలో వర్షం ఆశించినస్థాయిలో కురిసి ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శాలువ, జ్ఞాపిక, శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో టిటిడి జెఈవో సన్మానించారు.
ఆకట్టుకున్న అష్టావధానం :
ఈ సందర్భంగా టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన అష్టావధానం ఆకట్టుకుంది. శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు ఉగాది పర్వదినం గురించి పరిచయం చేశారు. డా|| సముద్రాల లక్ష్మణయ్య అధ్యక్షత వహించగా, ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు సమన్వయకర్తగా వ్యవహరించారు. శ్రీ మైలవరపు మురళీకృష్ణ అవధానం చేశారు. నిషిద్ధాక్షరి శ్రీ చెంచుసుబ్బయ్య, సమస్య శ్రీ చెన్నకేశవులునాయుడు, దత్తపది శ్రీ శ్రీమన్నారాయణ, న్యస్తాక్షరి శ్రీ వై.పరమేశ్వరయ్య, వర్ణన శ్రీ రామచంద్రారెడ్డి, ఆశువు శ్రీ రెడ్డెప్ప, చిత్రగణితం శ్రీమతి తేజోవాణి, అప్రస్తుత ప్రశంస శ్రీ హేమంత్‌కుమార్ చేశారు.
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలతో ”తెలుగు వైతాళికులు” వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉగాది సందర్భంగా టిటిడి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన వ్యాసరచన, పద్యపఠనం, కవితలు, పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న ఉద్యోగుల వివరాలను జత చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీమతి ఝాన్సీ, శ్రీధనంజయులు, హెచ్‌డిపిపి ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వైవిఎస్.పద్మావతి ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.