STRICTLY ADHERE TO COVID GUIDELINES-TTD EO _ కోవిడ్ నిబంధనల మేరకు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం: టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
A review meeting was at the PAC waiting hall located adjacent to Vontimitta temple on Friday. Addressing the TTD and district authorities EO said, the Government of India has issued Covid guidelines specifically on the conduct of religious events.
As we are allowing only five thousand devotees we need to discuss on how to distribute passes. All the departments shall thoroughly go through these guidelines for making arrangements accordingly and make the event a hassle-free one, he added.
He also directed the TTD and district medical wing to keep ready a sufficient number of water and buttermilk packets and also first aid kits as summer heatwaves are already soaring high.
He said a Single point contact officer from both TTD and district administration would help in ensuing problem-free arrangements. He also asked SP Sri Anburajan to chalk out a plan to over come traffic concerns.
YSR Kadapa district collector Sri Harikiran briefed the arrangements for the major religious event on behalf of the district administration. He also said the process of distribution of passes to be discussed as only 15 days are left for Kalyanam.
Earlier JEO Smt Sada Bhargavi briefed about the arrangements for the grand event from the side of TTD.
Local legislator Sri Meda Mallikarjuna Reddy, all top brass officials of YSR Kadapa district and TTD were present.
కోవిడ్ నిబంధనల మేరకు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం: టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
ఏప్రిల్ 26న కల్యాణానికి విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 09: ఒంటిమిట్టలో ఏప్రిల్ 26వ తేదీ నిర్వహించే శ్రీ కోదండరామస్వామివారి కల్యాణానికి కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని, ఇందుకోసం 5 వేల మందికి పాసులు జారీ చేస్తామని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్, ఎస్పీ శ్రీ అన్బురాజన్ తో కలిసి ఈఓ పరిశీలించారు. అనంతరం రాములవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడారు. శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఏప్రిల్ 26న రాత్రి 8 గంటలకు రాములవారి కల్యాణం నిర్వహించాలని టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా కల్యాణానికి విచ్చేయనున్నట్టు తెలిపారు. కల్యాణవేదిక వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపడతామన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. పాసులు పొందలేనివారు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణాన్ని వీక్షించవచ్చన్నారు. భక్తులందరూ టిటిడికి సహకరించాలని ఈ సందర్భంగా ఈఓ విజ్ఞప్తి చేశారు.
ఈఓ వెంట స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జున రెడ్డి, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.