STRIVE TO ACHIEVE NAC RECOGNITION TO TTD SV ARTS COLLEGE- TTD JEO _ టీటీడీ ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపున‌కు కృషి చేయాలి – జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 30 May 2022: TTD JEO Smt Sada Bhargavi has urged officials to speed up pending development works at SV Arts college to facilitate the grant of NAC recognition to the institution.

Reviewing after an inspection of the works at the College on Monday with officials, the TTD JEO said since the NAC committee was expected to visit the college by June 30, the engineering officials should complete all works by June 28 itself.

Directing them to enhance the standard of infrastructure the TTD JEO gave valuable suggestions on improvements to IT classes, solar power plant, modernisation of labs, enhancement of greenery and landscape etc.

Among others she asked officials to prepare a PowerPoint presentation (PPP) focusing on the quality of education, teaching ethics, and college Administration. The College already passed A grade and efforts should be to procure A+ rank, she said.

CE Sri Nageswara Rao, DEO Sri Govindarajan, DFO Sri Srinivasa.Reddy, SE (Electrical) Sri Venkateshwarlu, EEs Sri Krishna Reddy, Sri Venugopal and Dr Narayanamma, Principal of the college were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపున‌కు కృషి చేయాలి – జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి 2022 మే 30: తిరుప‌తిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలకు నాక్ ఏ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపున‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను జెఈవో సోమ‌వారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

అనంత‌రం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా జెఈవో మాట్లాడుతూ, జూన్ 30న నాక్ క‌మిటీ క‌ళాశాల‌ను సంద‌ర్శించ‌నున్నట్లు తెలిపారు. క‌ళాశాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను జూన్ 28వ తేదీకి పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. క‌ళాశాల‌లో మౌళిక వ‌స‌తుల‌ను మ‌రింత‌గా మెరుగుప‌ర‌చాల‌న్నారు. క‌ళాశాల‌లో ఐటి త‌ర‌గ‌తి గ‌దులు, సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌, ల్యాబ్‌ల ఆధునీక‌ర‌ణ‌, ప‌చ్చ‌ద‌నం పెంపొందించ‌డం త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

క‌ళాశాల‌లోని వసతులు, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, కళాశాలలో అమలు చేస్తున్న పాల‌న‌, బోధ‌న అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ సిద్ధం చేయాల‌న్నారు. ఇప్ప‌టికే క‌ళాశాల‌కు ఏ గ్రేడ్ గుర్తింపు ఉంద‌ని, నాక్ ఏ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపున‌కు అధ్యాప‌కులు, విద్యార్థులు కృషి చేయాల‌ని కోరారు.

సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డిఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాస‌ రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్) శ్రీ‌ వెంక‌టేశ్వ‌ర్లు, ఇఇలు శ్రీ క్రిష్ణారెడ్డి, శ్రీ వేణుగోపాల్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.నారాయ‌ణ‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.