STUDY BODY PHILOSOPHY TO REACH YOUR GOALS EASILY _ శరీర తత్వాన్ని ప్రేమిస్తూ అధ్యయనం చేస్తే సులువుగా లక్ష్యాలు చేరుకోవచ్చు

CHAIRMAN OF COMMISSION FOR INDIAN SYSTEMS OF MEDICINE_ SRI VAIDYA JAYANT YASHWANT DEV PUJARI

TIRUPATI, 24 MARCH 2023: Sri Vaidya Jayant Yashwant Dev Pujari, the Chairman, the Commission for Indian Systems of Medicine said that if students understand their body philosophy and adopt the study method accordingly with dedication, they will be able to achieve the desired goal in an effortless manner.

Shri Vaidya Jayant Yashwant Dev Poojary, Chairman, the Commission for Indian Systems of Medicine said that if students understand their body philosophy and adopt the study method accordingly with dedication, they will be able to easily achieve the desired goal.

During his visit to SV Ayurvedic Hospital on Friday evening,  Sri Pujari has given a detailed methodology to the students on how to study Ayurveda. Explaining the superiority of Ayurveda Samhita he narrated in detail that how they contribute to the study. He said that Ayurvedic medicine is gaining popularity all over the world and added that the best results can be achieved by researching and studying them thoroughly.

He inspected all the wards in the TTD-run SV Ayurvedic college and hospital and interacted with the patients undergoing treatment. Sri Pujari lauded the services of TTD.

Ayurveda College Principal Dr. Muralikrishna, Vice Principal Dr. Sundaram, Medical Superintendent Dr. Renu Dixit, Dr. Jagadish Kumar, Dr. Srinivasa Kumar teachers and students participated in this program

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శరీర తత్వాన్ని ప్రేమిస్తూ అధ్యయనం చేస్తే సులువుగా లక్ష్యాలు చేరుకోవచ్చు

– కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ చైర్మన్
శ్రీ వైద్య జయంత్ యశ్వంత్ దేవ్ పూజారి

తిరుపతి 24 మార్చి 20 23: విద్యార్థులు తమ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని అంకితభావంతో అందుకు అనుగుణంగా అధ్యయన విధానాన్ని అవలంబిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించగలుగుతారని కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ చైర్మన్ శ్రీ వైద్య జయంత్ యశ్వంత్ దేవ్ పూజారి చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయుర్వేద వైద్యాన్ని ఏ విధంగా అభ్యసించాలి అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఆయుర్వేద సంహితలు, వాటి ఔన్నత్యాన్ని వివరిస్తూ, అవి అధ్యయనానికి ఏ విధంగా తోడ్పడతాయో సవివరంగా తెలియజేశారు. ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ఈ వైద్యం మూలలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని పరిశోధన, అధ్యయనం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. అంతకుముందు ఆయన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలనుసందర్శించారు.

వైద్యశాలలో ఉన్న వసతులను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్యశాల అందిస్తున్న ఉచిత సదుపాయాలను, ఇందుకుగాను టీటీడీ అందిస్తున్న చేయూతను కొనియాడారు. వైద్యశాలలోని పంచకర్మ, చిన్నపిల్లలవిభాగం, చెవి ముక్కు గొంతు విభాగం, స్త్రీ వ్యాధుల చికిత్సల విభాగం , కాయ చికిత్స విభాగాల ద్వారా అందిస్తున్న చికిత్సలను ఆయన తెలుసుకున్నారు. ఆయుర్వేద కళాశాల,వైద్యశాల చక్కని సేవలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, వైద్య శాల సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ జగదీష్ కుమార్, డాక్టర్ శ్రీనివాస కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది