STUDY TOUR OF SRISAILAM DEVASTHANAMS TEAM CONCLUDES _ టిటిడి పాల‌న‌పై ముగిసిన శ్రీ‌శైలం దేవ‌స్థానం అధికారుల అధ్య‌య‌నం, శిక్షణ

Tirupati, 04 February 2022: The three – day long training and study of TTD systems and management at the SVETA Bhavan for the Srisailam temple team concluded on Friday.

 

Under the instructions of Honourable CM of AP Sri YS Jaganmohan Reddy who directed the staff of some major Endowments temple in the state to learn and implement TTD model in pilgrim crowd management, a 10-member team from Sri Sailam reached the temple city on Wednesday.

 

TTD officials imparted training and awareness on TTD auditing, accounting,hundi counting, protocol Darshan, Vigilance and security, Queue line management, Anna Prasadam, Laddu Prasadam production, modernisation of kitchen, Accommodation, revenue gathering measures, Darshan tickets issue, IT, Tenders, asset management, leases , Dharmic projects, clean and green, gardens and Veda Pathashalas.

 

The Srisailam temple officials also visited all the places in Tirumala, TTD local temples, SVBC studios etc. for hands on experience.

 

Srisailam EO Sri Lavanna and his team, SVETA director Smt Prashanti, CAO Sri Venkataramana properties AEO Sri Ashok, Revenue AEO Sri Muniratnam, course coordinator Sri Balaji Deekshitulu were present.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి పాల‌న‌పై ముగిసిన శ్రీ‌శైలం దేవ‌స్థానం అధికారుల అధ్య‌య‌నం, శిక్షణ

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 04: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అమ‌లుచేస్తున్న ప‌రిపాల‌న విధానాలను ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ శైలం ఆలయ అధికారులు అధ్య‌య‌నం చేశారు.

తిరుప‌తిలోని శ్వేత భవనంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ మూడు రోజుల్లో టిటిడి ఆడిటింగ్‌, అకౌంటింగ్‌, హుండీ కానుకల లెక్కింపు, ప్రోటోకాల్ ద‌ర్శ‌నాలు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటి, అన్న‌దానం, ప్ర‌సాదాల తయారీ, వంట‌శాల‌ల ఆధునీక‌ర‌ణ‌, వ‌స‌తి క‌ల్ప‌న‌, ఆదాయమార్గాలు మెరుగుప‌ర్చ‌డం, ద‌ర్శ‌న టికెట్ల జారీ విధానం, ఐటి, టెండ‌ర్ల నిర్వ‌హ‌ణ‌, ఆస్తుల నిర్వ‌హ‌ణ‌, లీజుకు ఇవ్వ‌డం, ధార్మిక ప్రాజెక్టులు, పారిశుద్ధ్యం, ఉద్యాన‌వ‌నాలు, వేద‌పాఠ‌శాల‌లు త‌దిత‌ర అంశాలపై శిక్షణ ఇచ్చారు. చివ‌రి రోజు ఫైనాన్స్‌, ఎస్టేట్ విభాగాల అధికారులు వీరికి అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ మూడు రోజుల్లో శ్రీ‌శైలం దేవ‌స్థానం అధికారులు తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంతాల్లోని స్థానిక ఆల‌యాల‌ను, ఎస్వీబీసీ కార్యాల‌యాన్ని సంద‌ర్శించి అక్క‌డి వ్య‌వ‌స్థ‌ను ప‌రిశీలించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శైలం దేవ‌స్థానం ఈవో శ్రీ ల‌వ‌న్న‌తోపాటు 10 మంది వివిధ విభాగాల అధికారులు, శ్వేత సంచాలకులు శ్రీ‌మ‌తి ప్రశాంతి, సిఏవో శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, ప్రాపర్టీస్ ఏఈఓ శ్రీ అశోక్, రెవెన్యూ ఏఈఓ శ్రీ మునిరత్నం‌, కోర్సు కో-ఆర్డినేటర్ శ్రీ బాలాజి దీక్షితులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.