SUBHAPRADHAM GETS THUMBS UP FROM STUDENTS_ శుభప్రదంతో ధర్మప్రచారం

Tirupati, 30 May 2018: The summer training camp Subhapradham by TTD aimed at inculcating ethical values among students of 7th, 8th and 9th standards from across the State has won the hearts of the children as well their parents.

The Hindu Dharma Prachara Parishad (HDPP) wing of TTD has been organising Subhapradham from the past six years during summer vacation. This year also TTD has commenced this week long training camp on May 25 which will conclude on June 1. Out of 4,300 students who registered for this summer training camp, 3,348 have been attending the classes. To train these students,126 trainers have been given special training by TTD in Hindu Sanatana Dharma and moral values.

SEVEN COLLEGES HOSTS THE TRAINING CAMP

TTD is organising the training classes in seven of its educational institutions separately for boys and girls with free lodging and boarding facilities in its hostels. Of the total, the boys who are under going training includes 742 in SV Arts College, 586 in SGS Arts College, 860 in SV Junior College while among girls, 469 in SPWDPG College, 236 in SP Junior College, 336 in SV Oriental College and 119 in SP Polytechnic College are undergoing training.

DAY SCHEDULE:

The day schedule commences with Yoga, Meditation by 6:30am followed by breakfast at 8am. The morning classes will be conducted between 9am and 12:30pm while the afternoon session commences from 3:30pm to 6pm. The lunch break will be from 12:30pm to 2pm in between followed by one and a half hours rest hour. Again there will be devotional music and harikatha parayanam every day between 6pm and 8pm followed by dinner which lasts for an hour.

LESSONS TAUGHT IN THE TRAINING PROGRAMME

The students were taught on the tenets of Hindu Sanatana Dharma, about Tirumala Srivaru, temple and its history, festival, Bhagavatgita, Arsha Vignanam, Personality Development, importance of family, different types of professions in the society, Mother language, Patriotism etc. There will be interactive session with the students on the lessons taught after each chapter is completed.

OTHER FACILITIES:

The food served to the students is with delicious delicacies which includes Mudda Pappum, Curry, Sambar, Chutney, Rasam, Papad, Banana and a sweet. In between break fast and lunch, buttermilk is served to the students as a relief from scorching heat. While as evening snack, Vada and buttermilk are served, in the night after food, milk is served to the students.

If in the case of any health emergency, Dispensaries with necessary medical facilities and doctors are kept ready by TTD.

Apart from this, TTD will also give to and fro charges to the students who are hailing from different districts of Andhra Pradesh for the training camp.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పసిహృదయాల్లో ధర్మబీజాలు

శుభప్రదంతో ధర్మప్రచారం

ఏడుకొండలవాడి పాదాల చెంత ఏడు కేంద్రాలు

126 మంది బోధకులు, 3,348 మంది విద్యార్థులు

మే 30, తిరుపతి, 2018: నేటి బాలలే రేపటి పౌరులు. చిన్నతనంలో ముఖ్యంగా పాఠశాల స్థాయిలో సనాతన ధర్మాన్ని పరిచయం చేస్తే వారి జీవితం ధర్మబద్ధంగా సాగుతుంది. పెరిగి పెద్దయిన తరువాత బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తారు. తద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన టిటిడి ధర్మప్రచారంలో భాగంగా వేసవి సెలవుల్లో బాలబాలికలకు శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. పసిహృదయాలపై ధర్మబీజాలు నాటుతోంది. ఈ ధర్మబీజాలు మొలకెత్తి విద్యార్థులకు జ్ఞానవృక్షాన్ని ప్రసాదిస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

బాలబాలికలకు గ్రహణశక్తి ఎక్కువ :

సాధారణంగా 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులో నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ తరగతుల విద్యార్థులను శుభప్రదం శిక్షణకు ఎంపిక చేయడానికి ఇది కూడా ఒక కారణం. ఈసారి టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఏడుకొండలవాడి పాదాల చెంత గల తిరుపతిలోని ఏడు టిటిడి విద్యాసంస్థల్లో శుభప్రదం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. మే 25న ప్రారంభమైన ఈ తరగతులు జూన్‌ 1వ తేదీ వరకు జరుగనున్నాయి. మొత్తం 4,300 మంది విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,348 మంది శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో 742 మంది బాలురు, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో 586 మంది బాలురు, ఎస్వీ జూనియర్‌ కళాశాలలో 860 మంది బాలురు, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాలలో 469 మంది బాలికలు, శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాలలో 236 మంది బాలికలు, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాలలో 336 మంది బాలికలు, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్‌ కళాశాలలో 119 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు. సువిశాలమైన భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. చక్కటి హాస్టల్‌ వసతి కల్పించారు.

చక్కటి సమయసారిణి :

సమయం వృథా కాకుండా విద్యార్థుల కోసం సమయసారిణి రూపొందించారు. ఉదయం 6.30 గంటలకు యోగ సాధనతో రోజు మొదలవుతుంది. అల్పాహారం తరువాత ఉదయం 9 నుండి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు పాఠ్యాంశ బోధన ఉంటుంది. విరామ సమయంలో ఉదయం మజ్జిగ, సాయంత్రం టీ ఇస్తారు. మధ్యాహ్నం 12.30 నుండి 2 గంటల వరకు భోజన విరామం, మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు విశ్రాంతి ఇస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తారు. రాత్రి 8 గంటలకు భోజనం అందిస్తారు.

పాఠ్యాంశాలివే… :

విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలను రూపొందించి బోధిస్తున్నారు. శ్రీనివాస అవతారం, తిరుమల క్షేత్ర పరిచయం, శ్రీవారి ఉత్సవాలు, భగవద్గీత, ధర్మలక్షణాలు, ప్రాచీనకాలంలో ధర్మవీరులు, రామాయణ, భారత, భాగవత సందేశం, ప్రాచీనకథలు-మానసిక వికాసం, ఆర్షవాఙ్మయం-వ్యక్తిత్వ వికాసం, కుటుంబం ద్వారా వికాసం, పండుగలు-వైశిష్ట్యం, శతకపద్యాలు, జాతీయ పర్వదినాలు, కట్టు-బొట్టు ప్రత్యేకతలు, సమాజంలో వృత్తులు, మర్యాదలు-సంప్రదాయాలు, మాతృభాష-భావవ్యక్తీకరణ, విద్య ద్వారా ప్రగతి, దేశభక్తి, వేదపరిచయం తదితర అంశాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ప్రతి ఉపాధ్యాయుడు ఆయా పాఠ్యాంశాన్ని బోధించిన తరువాత కొన్ని ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి సమాధానాలు రాబడుతున్నారు. సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తున్నారు.

రుచికరమైన భోజనం :

విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల హాస్టళ్లలో రుచికరమైన భోజనం అందించి బస కల్పిస్తున్నారు. ఉదయం అల్పాహారం, ఆ తరువాత మజ్జిగ, మధ్యాహ్నం అన్నం, పప్పు, కర్రీ, సాంబారు, చట్ని, రసం, అప్పడం, అరటిపండు, స్వీట్‌ అందిస్తున్నారు. సాయంత్రం వడ, మజ్జిగ, రాత్రి భోజనంతోపాటు పాలు కూడా ఇస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యసమస్యలు ఎదురైనా వెంటనే సంప్రదించేందుకు వీలుగా అన్ని కేంద్రాల వద్ద వైద్యులను అందుబాటులో ఉంచారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.