SUBHAPRADHAM AIMS AT INCULCATING ETHICAL VALUES AMONG STUDENTS-TIRUPATI JEO_ మే 25 నుండి జూన్‌ 1వ తేదీ వరకు ‘శుభప్రదం’

Tirupati, 9 May 2018: The week-long summer training camp ‘Subhapradham’ program aims at inculcating ethical and dharmic values among students, said Tirupati JEO Sri P Bhaskar.

A review meeting on Subhapradham was held at Sri Padmavathi Rest House in Tirupati on Wednesday. The JEO said this year this dharmic educational camp will be conducted in Tirupati from May 25 to June 1. “We have selected seven TTD educational institutions for these residential classes. The application forms are available from May 10 to 19 in all TTD kalyana Mandapams and also they can download from TTD Website. They can handover these application form to the Dharma Pracharam Mandali (DPM)s located in various districts.

Adding further he said though TTD is organising dharmic exams and ethical summer camps it is reaching only a limited number of students. “There are over 50 lakh students from 6th to 8th standard in both Telugu speaking states. To reach wide range of the students, our EO Sri Anil Kumar Singhal has conducted a meeting with Hindu Dharma Prachara Parishad (HDPP) wing of TTD and mulled to train intellectual resource persons from each district. So that they can conduct the classes on dharmic values to make our students the best citizens of tomorrow”, he added.

HDPP secretary Sri Rama Krishna Reddy, Project Special Officer Sri Ramana Prasad, Epic exams co-ordinator Sri Damodar Naidu and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

మే 25 నుండి జూన్‌ 1వ తేదీ వరకు ‘శుభప్రదం’తిరుపతిలోని 7 కేంద్రాల్లో 3 వేల మందికి శిక్షణ ఏర్పాట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

మే 09, తిరుపతి, 2018: భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలు, ఆర్ష ధర్మాలపై అవగాహన కల్పించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉన్నతాశయంతో మే 25 నుండి జూన్‌ 1వ తేదీ వరకు 7, 8, 9 తరగతుల విద్యార్థులకు శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం టిటిడి అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుపతిలోని 7 కేంద్రాల్లో 3 వేల మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌డిపిపి ప్రోగ్రాం అసిస్టెంట్‌, జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, టిటిడి కల్యాణమండపాలతోపాటు టిటిడి వెబ్‌సైట్‌లో మే 10వ తేదీ నుండి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను మే 19వ తేదీలోపు తిరిగి అక్కడే సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. తిరుపతిలోని విద్యార్థులు స్థానిక అన్నమాచార్య కళామందిరంలోని హెచ్‌డిపిపి కో-ఆర్డినేటర్‌ వద్ద దరఖాస్తులు పొందవచ్చన్నారు. ఈ తరగతుల్లో శ్రీవేంకటేశ్వరుని జీవితచరిత్ర, భగవద్గీత, సనాతన ధర్మపరిచయం, రామాయణ, భారత, భాగవత సందేశం, ఆర్ష వ్మాయం, వ్యక్తిత్వ వికాసం, భారతీయ కుటుంబ జీవనం, పండుగలు-పరమార్థాలు, ఆచారాలు – వైజ్ఞానిక దృక్పథం, మాతృభాష, విద్య, దేశభక్తి తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వివరించారు.

తిరుపతిలోని టిటిడి విద్యాసంస్థలైన ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు జూనియర్‌ కళాశాల, ఓరియంటల్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జెఈవో తెలిపారు. మే 25వ తేదీన విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సూచనలిచ్చేందుకు ఆర్‌టిసి బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటుచేయాలని, ఆయా కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు రానుపోను ఛార్జీలు, మెటరీయల్‌, నిష్ణాతులతో బోధన అందిస్తామన్నారు. ప్రథమ చికిత్స, తాగునీరు, ఆహారం, భద్రత, వసతి, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, సిఎంఓ డా|| నాగేశ్వరరావు, ప్రాజెక్టు అధికారి డా|| రమణప్రసాద్‌, ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి ఆచార్య దామోదరనాయుడు, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.