SUICIDE AT TIRUMALA IS A SIN-VAIKHANASA AGAMA ADVISOR DR AV RAMANA DEEKSHITULU _ శ్రీ‌వారి భ‌క్తులు తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాలి – టిటిడి ఆగమ సలహాదారు డా..ఎ.వి.రమణ దీక్షితులు

Tirumala, 13 Dec. 19: The Vaishanasa Agama Advisor,  Dr A V Ramana Dikshitulu advocated that suicides in Tirumala were an unwelcome feature and infact a big sin.

Speaking to media persons at his residence in Tirumala on Friday, the Agama advisor said it was a wrong thing and a superstition among some devotees that death in Tirumala earns them Vaikunthaprapthi-salvation from mortal world.

His comments came following the death of a pilgrim on Friday who intentionally  fell under a milk van at around 5:30am nearby the temple.

He said since death occurred on the mada streets surrounding the temple, the purification rituals were performed which included Suddhi, Punyahavachanam etc.inthe temple and the holy water is sprinkled in the incident area and later the daily worship continued.

He once again appealed to devotees not to undertake such irrational acts with false beliefs as it would affect the sentiments of millions of devotees across the world.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీ‌వారి భ‌క్తులు తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాలి – టిటిడి ఆగమ సలహాదారు డా..ఎ.వి.రమణ దీక్షితులు

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 13: తిరుమ‌ల‌లో ఆత్మహత్యలు మ‌హా పాప‌మ‌ని,  శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తులు తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల‌ని టిటిడి ఆగమ సలహాదారు డా..ఎ.వి.రమణ దీక్షితులు కోరారు. తిరుమ‌ల‌లోని త‌న నివాసంలో శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తిరుమలలో దేహ త్యాగం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మూడనమ్మకంతో ఎవ్వ‌రు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడద‌న్నారు. తిరుమలలో ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవిస్తే శ్రీ‌వారి అనుగ్ర‌హంతో అలాంటి వారు మాత్రమే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంద‌న్నారు. అంతేకాని బ‌ల‌వంత మ‌ర‌ణానికి పాల్ప‌డ‌కూడ‌ద‌న్నారు.  

ఆలయం సమీపంలో తెల్లవారుజామున 5:30 గంటలకు ఉద్దేశపూర్వకంగా పాల వ్యాన్ కింద పడి యాత్రికుడు మరణించ‌డం భాద‌క‌రంమ‌న్నారు. మాఢ వీధులలో మరణం జరగడంతో ఆల‌యంలో వైఖాన‌స ఆగ‌మ బ‌ద్ధంగా  పుణ్యాహ‌వ‌చ‌నం, ల‌ఘు సంప్రోక్ష‌ణ‌, శుద్ది నిర్వ‌హించినట్లు తెలిపారు. అనంత‌రం యధావిధిగా కైంక‌ర్యాలు, ఆరాధ‌న  నిర్వహించిన‌ట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే విధంగా తప్పుడు నమ్మకాలతో ఇలాంటి చర్యలు చేయవద్దని ఆయన మరోసారి భక్తులకు విజ్ఞప్తి చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.