VEGETABLE DONORS AND RICE MILLERS ASSOCIATION ARE LIKE TWO HANDS OF OUR ANNAPRASADAM – ADDNL.EO _ కూరగాయల దాతలు మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ టిటిడి అన్నప్రసాదం విభాగానికి రెండు చేతులు – అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 13 Dec. 19: Terming the Vegetable donors and Rice Millers Association as two eyes and hands of Annaprasadam wing of TTD,  the Additional Executive Officer Sri A V Dharma Reddy sought the Rice owners to come up with more generous contributions to provide more qualitative Annaprasadam services to pilgrims.

A review meeting with representatives of AP and TS Rice Millers association in Tirumala on Friday at Annamaiah Bhavan.

He complimented the Rice Millers Association for providing Sona Masuri rice to TTD at Rs.37 per kilo when the market rate is Rs.45. He also thanked the Association for providing Rs.55lakhs worth rice free of cost in the last two months upon his request. The Additional EO also asked them to consider contributing more to TTD Annaprasadam wing.

The Rice Millers also sought Additional EO to consider providing darshan to Rice Millers to encourage more donations to which Sri Dharma Reddy, he will definitely putforth the same in the upcoming Trust Board Meeting.

Procurement GM Sri Jagadeeshwar Reddy,  DyEO Annaprasadam Sri Nagaraju,  DyEO Marketing Sri Natesh Babu,  Catering Officer Sri GLN Shastry, AP Rice Millers Association Chief Sri G Venkateswara Rao, representatives from Khaammam,  Nizamabad,  Guntur also participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

కూరగాయల దాతలు  మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ టిటిడి అన్నప్రసాదం విభాగానికి రెండు చేతులు  –  అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి  
       
తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 13: శ్రీ‌వారి భ‌క్తుల‌కు రుచిక‌ర‌మైన, నాణ్య‌మైన అన్న ప్ర‌సాదాలు అందించే అన్నప్రసాదం విభాగానికి కూరగాయల దాతలు మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు రెండు క‌ళ్ళు మరియు చేతులు వంటివ‌ని  టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో అన్న‌మయ్య భవనంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా అదనపు ఈవో మాట్లాడుతూ  రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌వారు కిలో బియ్యం మార్కెట్ రేటు రూ .45 ఉన్నప్పుడు సోనా మసూరి బియ్యాన్ని టిటిడికి కిలోకు రూ .37 చొప్పున అందిస్తునందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ను ఆయన అభినందించారు. తమ‌ అభ్యర్థన మేరకు గత రెండు నెలల్లో రూ .55 లక్షల విలువైన బియ్యాన్ని ఉచితంగా అందించినందుకు అసోసియేషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టిటిడి అన్నప్రసాదం విభాగానికి మరింత సహకారం అందించాలని అదనపు ఈవో వారిని కోరారు.

రైస్ విరాళాలను ప్రోత్సహించడానికి రైస్ మిల్లర్లకు దర్శనం ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవాల‌ని రైస్ మిల్లర్స్ అదనపు ఈవోను కోరారు. అందుకు ఆయ‌న రాబోయే ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సమావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

ఈ స‌మావేశంలో ప్రొక్యూర్‌మెంట్ జిఎం శ్రీ జగదీశ్వర్ రెడ్డి,  అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగరాజు,  మార్కెటింగ్ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి, ఎపి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్య‌క్షుడు శ్రీ జి వెంకటేశ్వరరావు, ఖమ్మం, నిజామాబాద్, గుంటూరు ప్రతినిధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.