SUNDARAKANDA PARAYANAM OFF TO A GRAND START _ ఘ‌నంగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభం

Tirumala, 11 Jun. 20: After successfully completing Yoga Vasishtyam-Dhanwantari Maha Mantra Parayanam for 62 days, TTD has commenced “Sundarakanda Pathanam” from Thursday onwards on the Nada Neerajanam platform in Tirumala.

Sudarakanda is the fifth section of the epic of Srimad Ramayana written by Sage Valmiki. He divided his work into Kandams or Sections. ‘Bala Kandam’, ‘Ayodhya Kandam’, ‘Aranya Kandam’, ‘Kishkinda Kandam’, ‘Sundara Kandam’, ‘Yuddha Kandam’ and ‘Uttara Kandam’. The fifth one is Sundara Kandam comprising of 68 Sargas (chapters) with 2821 slokas (in TTD published Srimad Ramayanam). By reciting the slokas in Sundarakanda, one shall emerge victorious; overcome the dreadful diseases, disease-causing viruses etc.

The programme commenced with the introduction by stalwarts including Sri KSS Avadhanadi, Sri Janamaddi Ramakrishna Sastry, and Dr. A Vibheeshana Sharma about the significance of Sundarakanda Parayanam. Later TTD Asthana Vidwan Dr. G Balakrishna Prasad rendered Sankeertan, “Ramudu Lokabhiramudu Udayinchagaanu”. This is followed by Sundarakanda Pathanam. On the first day, six slokas were recited. This was followed by another Annamacharya Sankeertana, “Periginadu Choodaro Pedda Hanumanthudu”.

Speaking on this occasion, TTD Trust Board Chairman Sri Y V Subba Reddy, said, to ward off the ill effects of Corona COVID 19 Virus from the world, TTD has taken up the recitation of Yoga Vasishtyam in the last two months. With the blessings of Lord Venkateswara, we have resumed darshanam for the pilgrims from today onwards. So we have taken up “Sundarakanda Pathanam”, he added.

Vice-Chancellors of Vedic Varsity Sri Sannidhanam Sudarshana Sharma, of Rastriya Sanskrit Vidya Peetham Sri Muralidhara Sharma, TTD Additional EO Sri A V Dharma Reddy, Annamacharya Project Director Sri S Dakshinamurthy, HDPP Secretary Sri Rajagopalan and other expert scholars were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘ‌నంగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభం

తిరుమ‌ల‌, 2020 జూన్ 11: తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై 62 రోజుల పాటు యోగవాశిస్టం – ధ‌న్వంత‌రి మ‌హామంత్ర పారాయ‌ణం అనంత‌రం గురువారం సుంద‌ర‌కాండ ప‌ఠ‌నం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్తల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని, క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ 2 నెల‌ల పాటు యోగ‌వాశిస్టం పారాయ‌ణం చేసిన‌ట్టు తెలిపారు. స్వామివారి ఆశీస్సుల‌తో గురువారం నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభించామ‌న్నారు. ఈ రోజు నుండి సుంద‌ర‌కాండ ప‌ఠ‌నం ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన శ్రీ‌మ‌ద్ రామాయ‌ణంలో ఐదో విభాగం సుంద‌ర‌కాండ‌. బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింద‌కాండ‌, సుంద‌ర‌కాండ , యుద్ధ‌కాండ మ‌రియు ఉత్త‌ర‌కాండ‌లుగా రామాయ‌ణాన్ని ర‌చించారు. టిటిడి ముద్రించిన శ్రీమ‌ద్ రామాయ‌ణం గ్రంథంలోని సుంద‌ర‌కాండ‌లో 68 స‌ర్గ‌ల్లో 2821 శ్లోకాలున్నాయి. సుంద‌ర‌కాండ‌లోని శ్లోకాల‌ను ప‌ఠించ‌డం వ‌ల్ల విజ‌యం సిద్ధిస్తుంద‌ని, వైర‌స్ కార‌ణంగా వ‌చ్చే వ్యాధి బాధ‌లు తొల‌గుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ప్ర‌ముఖ పండితులు శ్రీ జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌శాస్త్రి, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ముందుగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. ఆ త‌రువాత టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్  “రాముడు లోకాభిరాముడు ఉద‌యించ‌గాను…”, “పెరిగినాడు చూడ‌రో పెద్ద‌హ‌నుమంతుడు…” త‌దిత‌ర సంకీర్త‌న‌లు ఆల‌పించారు. ‌మొద‌టిరోజు సుంద‌ర‌కాండ‌లో 6 శ్లోకాలు ప‌ఠించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య సన్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ‌, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ఎస్‌.ద‌క్షిణామూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.