SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS _ తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
TIRUPATI, 11 JUNE 2022: On the second day of Teppotsavams, Sri Sundararaja Swamy blessed devotees on finely decked float.
Deputy EO Sri Lokanatham, EE Sri Narasimha Murty, Archaka Sri Babu Swamy, Temple Inspector Sri Damodaram and devotees were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
తిరుపతి, 2022 జూన్ 11: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో రెండో రోజైన శనివారం శ్రీసుందరరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీసుందరరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దామోదరం, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.