SUPPORT KARTHIKA DEEPOTSAVAM- TTD JEO (E&H) TO VIZAG DISTRICT COLLECTOR _ కార్తీక మహా దీపోత్సవ నిర్వహణకు సహకారం అందివ్వండి

Visakhapatnam,10 November 2022: TTD JEO (E&H) Smt Sada Bhargavi appealed to Visakhapatnam district collector Dr Mallikarjun to extend all support from district administration towards the smooth conduct of  Karthika Maha Deepotsavam which is scheduled to take place on November 14 at Rama Krishna (RK) beach.

 

The TTD JEO called on the district collector on Thursday and sought the cooperation of police, GVMC, revenue, fisheries and fire services as the program lasts between 5.30 pm and 8 pm.

 

Responding to her request favourably the District Collector said the TTD conducting the Deepotsavam at Visakhapatnam was a blessing for devotees and people of the coastal city.

 

He assured to appoint an RDO as nodal officer and extend all coordination and support for the success of the holy ceremony.

 

VISAKHA SEER INVITED

 

JEO (E&H) Smt Sada Bhargavi has taken the blessings of Visakha Sharada Peetham Pontiff HH Sri Swarupanandendra Saraswati Swamy on Thursday and invited the seer to grace the Karthika Deepotsavam on November 14.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

కార్తీక మహా దీపోత్సవ నిర్వహణకు సహకారం అందివ్వండి

– జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జునకు టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి వినతి

తిరుపతి, 10 నవంబరు 2022: విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో నవంబరు 14వ తేదీ టీటీడీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందించాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జునను కోరారు.

గురువారం ఆమె కలెక్టరును కలసి కార్తీక మహాదీపోత్సవం నిర్వహణకు చేపట్టిన పనుల గురించి వివరించారు. పోలీస్, జివిఎంసి, రెవిన్యూ, మత్స్య శాఖ ,అగ్నిమాపక శాఖల నుంచి అవసరమైన సహకారం అందించాలన్నారు. సాయంత్రం 5-30 నుంచి రాత్రి 8 గంటలవరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. విశాఖలో టీటీడీ పెద్ద ఎత్తున దీపోత్సవం నిర్వహించడం విశాఖ వాసుల అదృష్టమని కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున చెప్పారు. ఆర్డీవో ను నోడల్ ఆఫీసర్ గా నియమించి అన్ని శాఖల నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.

కార్తీక దీపోత్సవానికి రండి

– విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతికి టీటీడీ జెఈవో ఆహ్వానం

విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నవంబరు 14వ తేదీ టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహాదీపోత్సవానికి హాజరు కావాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతిని ఆహ్వానించారు.

గురువారం ఆమె శారదా పీఠానికి వెళ్ళి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్తీక మహాదీపోత్సవానికి హాజరుకావాలని టీటీడీ తరపున ఆహ్వానించారు.
అనంతరం జెఈవో రుషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామివారి దర్శనం తరువాత అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది