AVOID DOUBTS ON WEIGHT AND QUALITY OF SRIVAR LADDUS- TTD _ శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు: టీటీడీ

Tirumala,10 November 2022: TTD on Thursday categorically clarified that there is complete transparency in the production of Srivari Laddus and devotees shall not doubt about the quality and quantity of laddus prasadams.

After being prepared in Srivari Potu (Temple kitchen) the potu workers load them in a tray which is weighed by TTD officials everyday before it is being dispatched to laddu sale counters.

TTD stated that each laddu weighs between 160-180 grams. The difference of minus 70grams is only because of the technical problem that occurred in laddu weighing machine and lack of knowledge on the same by contract workers the devotees were put jn confusion over the weight of laddu.

Tirumala laddu never weighs less than 160grams. TTD had been following the same Dittam from the past several years and the Potu workers who have been preparing laddus all these years never compromised on quality or quantity of laddus.

TTD has appealed to devotees not to believe in such rumours and also sought devotees to inform the concerned officials at laddu counters of any lapses to resolve the issues immediately.

But the fact that the concerned devotees had instead chosen to upload the issue on social media is rather unsavoury,  damaging the reputation of the religious institution, hurting the sentiments of millions of devotees.

Hence TTD reiterated to devotees not to believe in the social media reports on baseless allegations about quality and quantity of Srivari laddu which is trusted by millions of devotees across the world.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు: టీటీడీ

తిరుమల‌, 2022 నవంబరు 10: తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది .

ప్ర‌తి రోజు పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను ఒక ప్ర‌త్యేక‌ ట్రేలో ఉంచి, ప్ర‌తి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారు. అనంత‌రం ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను కౌంట‌ర్ల‌కు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారు. ఇందులో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది.

వేయింగ్ మిషన్‌లో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తులు అపోహల‌కు గుర‌య్యారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ల‌డ్డూ బ‌రువు, నాణ్య‌త విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదు.

సాధార‌ణంగా ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదేని ఇబ్బంది త‌లెత్తితే వేంట‌నే అక్క‌డ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేస్తే, అక్క‌డిక్క‌డే స‌మ‌స్యను ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ టీటీడీలో ఉంది. కానీ స‌దరు భ‌క్తుడు ఇవిఏమి చేయ‌కుండా సోష‌ల్ మీడియాలో టీటీడీపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయం.

కావున భ‌క్తుడు ఆరోపించిన‌ట్లు ల‌డ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్య‌త్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.