SUPRABHATA SEVA RESUMES _ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala, 15 January 2024: As the holy month of Dhanurmasam ended on Sunday, Suprabhata Seva resumed at the Tirumala Srivari Temple from Monday onwards.

Andal Sri Goda Thiruppavai Parayanam continued in Srivari Temple in place of Suprabhata Swva during Dhanurmasam which started from the early morning of December 17 last year.  But as Dhanurmasa clocks were completed on January 14, Suprabhata Seva resumed in Srivari temple from January 15 onwards.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, 2024 జనవరి 15: పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం ముగియడంతో సోమవారం ఉద‌యం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది.

గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజామున నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.