SUPRABHATAM BACK IN TIRUMALA TEMPLE FROM JAN 15_ జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala, 14 January 2018: Almost after a month’s time, Suprabhata seva commences in Tirumala from January 15 onwards.

With the advent of Dhanurmasam, Suprabhatam was replaced by Tiruppavai seva from December 17 last. With Makara sankramanam as per Hindu almanac, suprabhatam is set to commence in Tirumala temple from Monday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, జనవరి 14, 2018: పవిత్ర ధనుర్మాసం ఆదివారం ముగియడంతో జనవరి 15వ తేదీ సోమవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ ఉదయం 11.13 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే, జనవరి 14వ తేదీన ఆదివారంనాడు ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ సోమవారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.