SURGE IN PILGRIM RUSH _ రద్దీ సమయంలో భక్తులు ఓపికతో ఉండాలి : టీటీడీ
TIRUMALA, 06 OCTOBER 2022: Holidays coupled with Third Peratasi Saturday on the anvil lined up this week, heavy pilgrim rush being witnessed in Tirumala.
The pilgrim rush which was normal till October 4, picked from the afternoon of October 5.
All compartments and sheds in Narayanagiri Gardens are full to their capacity and the outside lines already reached Sila Toranam Centre by 10am of Thursday itself.
It is taking nearly 30 hours for the darshan of pilgrims visiting Tirumala. The devotees are requested to make note of this and co-operate with TTD.
రద్దీ సమయంలో భక్తులు ఓపికతో ఉండాలి : టీటీడీ
శిలా తోరణం వద్దకు చేరుకున్న క్యూలైన్లు
తిరుమల, 06 అక్టోబర్ 2022: పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ అక్టోబర్ 5 మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయం 10 గంటలకు క్యూలైన్లు శిలా తోరణం వద్దకు చేరుకున్నాయి.
తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరుతోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది