SURUTUPALLI SRI PALLIKONDESWARA SWAMY OFFERED SILKS ON BEHALF OF TTD _ సురుటుపల్లి శ్రీ పళ్లికొండేశ్వర స్వామివారికి టీటీడీ తరఫున పట్టువస్త్రాల సమర్పణ

Tirumala, 08 March 2024: On behalf of TTD, silk cloths were presented to Sri Pallikondeswara Swami at Surutupalli, a famous Siva temple, on the occasion of Mahasivaratri.

Srivari Temple Parupattedar Sri Umamaheshwara Reddy and Vedic Pundits took the Pattu Vastrams in a procession to the temple. 

The temple authorities welcomed and made darshan arrangements.  Silk clothes were presented to the Lord. 

On the occasion of Mahashivratri, it is customary to offer silk clothes to this temple on behalf of TTD.

Assistant Commissioner of Endowments Department Sri. Ramachandra Reddy, Chairman of the Temple Sri. Balaji Reddy, EO Sri. Saravana and others participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సురుటుపల్లి శ్రీ పళ్లికొండేశ్వర స్వామివారికి టీటీడీ తరఫున పట్టువస్త్రాల సమర్పణ

మార్చి 08, తిరుమల 2024: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన సురుటుపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వర స్వామివారికి టీటీడీ తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు.

శ్రీవారి ఆలయ పారుపత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి, వేదపారాయణదారులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రామచంద్ర రెడ్డి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ బాలాజిరెడ్డి, ఈవో శ్రీ శరవణ, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.