CEREMONIAL ABHISHEKAM TO KSHETRAPALAKA RUDRA _ తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

Tirumala, 08 March 2024: Abhishekam was performed on Friday to the Kshetrapalaka Rudra  near Gogarbham in Tirumala. 

It is customary to perform abhishekam every year on the occasion of Mahashivratri to Lord Rudra who is the Kshetrapalaka of Tirumala.

On this occasion, officials and priests from Srivari temple reached the Kshetrapalaka Shila with temple etiquette. 

Special abhishekam was done with milk, curd, sandalwood, cheese, coconut water etc.  After that an offering was made.  Prasadams were distributed to the devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమల, 2024 మార్చి 08: తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి శుక్ర‌వారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.