SURVEY ON DEVOTEE FACILITIES AT TIRUMALA REST HOUSES- TIRUMALA JEO_ తిరుమలలోని వసతి గృహాలు , యాత్రికుల వసతి సముదాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు – తిరుమల జె.ఈ.ఓ

Tirumala, 10 Oct. 17: On the directive of the TTD EO Anil Kumar Singhal the TTD has launched a comprehensive survey on facilities in its rest houses at Tirumala, the abode of Lord Venkateswara to focus on better amenities for common devotees.

Speaking to newsmen after review with officials on successful conduction of the annual Brahmotsavams the JEO (Tirumala) Sri KS Sreenivasa Raju said that the survey aimed at improvement of all facilities like – lights, fans, bed linen, blankets, toilets, geysers, cleanliness of toilets.The Survey was afoot at Ram bagicha, ATC, GNC, SNC, TBC, Narayana giri, Kalyanai, Kausthubham, Sapthagiri, and Varaswamy rest houses.The devotees were questioned about facilities and improvements sought and amends were made for future implementation.

The JEO congratulated the staff of all departments for coordinated efforts and successfully and effectively conducting the annual Brahmotsavams. He urged the officials to keep up the tempo by serving the devotees in the ensuing Peritasi month and also on Vaikunta Ekadasi day of December 28th and New Year Day.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమలలోని వసతి గృహాలు , యాత్రికుల వసతి సముదాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు – తిరుమల జె.ఈ.ఓ

అక్టోబరు 10, తిరుమల 2017: భూలోక వైకుంఠంగా పిలువబడే తిరుమల దివ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను అందించేందుకు తి.తి.దే ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచన మేరకు తి.తి.దే సీనియర్‌ అధికారులు మంగళవారంనాడు తిరుమలలోని వసతి గృహాలు, యాత్రికుల వసతి సముదాయాలలో సర్వే నిర్వహిస్తునట్లు తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

మంగళవారంనాడు అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు తి.తి.దే అధికారులకు, సిబ్బందికి తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మూెత్సవాలలో అన్ని విభాగాలవారు సమన్వయంతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. పెరటాశినెల చివరి శనివారం రెండవశనివారం సెలవురోజు కావడంతో భక్తులు అధికంగా విచ్చేసే అవకాశం ఉన్నందువల్ల అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

అదే విధంగా డిశెంబరు 29వ తేది వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వెలుపల క్యూలైన్ల నిర్వహణ మరియు తాత్కాలిక షెడ్లు ఏర్పాట్ల గురించి ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

తి.తి.దే సీనియర్‌ అధికారులు సామూహికంగా పద్మావతి విశ్రాంతి భవనాలు మినహా రాంభగీచా, వరాహస్వామి, సప్తగిరి, కల్యాణి, సుదర్శన వసతి గృహాలు, ఏ.టి.సి, జి.ఎన్‌.సి కాటేజీలు, నారాయణగిరి అతిథి భవనాలలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గదులలోని లైట్లు, ప్యాన్‌లు, బెడ్‌లు, రగ్గులు, స్నానపు గదులలో నీటి కుళాయిలు, గీజర్లు పనితీరు, మరుగుదొడ్ల శుభ్రత తదితర అంశాలను పరిశీలించి, అక్కడ తి.తి.దే అందిస్తున్న సౌకర్యాల గురించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయలను అడిగి వివరాలు సేకరించి నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.