JEO ADVICES ALL DEPTS TO GEAR UP FOR PERITASI DEVOTEES RUSH_ శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలకు అన్ని విభాగాలు సన్నద్ధం కావాలి – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 10 Oct. 17: Tirumala Joint Executive Officer Sri KS Sreenivasa Raju today advised all departments to gear up with more administrative reforms and provide more value added services to devotees of Lord Venkateswara.

Reviewing with senior officials at Annamaiah Bhavan here, Sri Raju said all departments should infuse reforms in all sectors to meet the challenge of ever increasing surge of devotees to Tirumala for darshan of Lord Venkateswara.

He said to increase laddu production additional space be converted in laddu potu inside Srivari Temple and also to modernize all boondi making ovens outside the temple.

The JEO instructed the officials of Vaikuntam Queue complex to prepare a detailed report to reduce wastage of Anna prasadams in queue lines. The Electrical department was told to ensure non-stop working of the telephone lines inside the compartments.

He wanted officials to keep all departments on alert in view of large crowds of devotees coming on October 13 and 6 in view of Peritasi month -holy Saturdays for Tamil devotees. He asked the VGO to prepare for fool proof security in queue lines. Rooms be made available for devotees by requesting to vacate rooms in time.

The JEO instructed the Anna Prasadam and Health department to prepare for non-stop supply of drinking water and Anna prasadams in queue lines during the next rush days of Peritasi month.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలకు అన్ని విభాగాలు సన్నద్ధం కావాలి – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

అక్టోబరు 10, తిరుమల 2017: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన సేవలందించడానికి ప్రతి విభాగంలో మౌలికమైన మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు.

మంగళవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సీనియర్‌ అధికారులతో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రానున్న రోజుల్లో భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా వారికి విశేష సేవలు అందించేందుకు ప్రతి విభాగంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకుంటూ సన్నద్ధం కావలసిన అవసరాన్ని గుర్తుచేశారు. శ్రీవారి పోటు విభాగంలో అదనపు స్థలం అన్వేషించవలసిన అవసరం ఉందన్నారు. తద్వారా ఎక్కువ లడ్డూలు తయారు చేసి, భక్తులకు అందించేందుకు వీలౌతుందన్ని తెలిపారు. అదేవిధంగా బూందిపోటులో ఉన్న అన్ని పొయ్యిలను ఆధునీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలను నిపుణుల నుండి తీసుకోవాలని సూచించారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లలో, వెలుపల క్యూలైన్లలో అన్న ప్రసాదాలు వృధా కాకుండా ప్రణాళికలు తయారుచేసి నివేదికలందించాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లలో ఉన్న ఫోన్‌లు నిరంతరం పనిచేసేందుకు అవసరమైన ఎలక్ట్రికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న పెరటాశి శనివారం సందర్భంగా ఈ నెల 13 నుండి 16వ తేది వరకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు ప్రతి విభాగం పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గదులు కేటాయింపు విషయంలో 24 గంటలు పూర్తయిన వెంటనే ఖాళీ చేసేలా భక్తులకు సూచించాలన్నారు. తద్వారా మరికొంతమంది భక్తులు గదులు పొందే వీలు కల్పించాలన్నారు. క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజివోను అదేశించారు. తిరుమలలో భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందించేందుకు ఆరోగ్య, అన్నప్రసాద విభాగాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో పలు విభాగాధిపతులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది