SURYA GRAHANAM TO IMPACT ON DARSHAN FOR 13HRS ON DEC 26 _ డిసెంబ‌రు 26న సూర్యగ్రహణం 13 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

Tirumala, 16 Dec. 19: TTD has announced closure of Srivari temple for 13 hours on December 26 in view of solar eclipse.

The Solar eclipse is slated to occur on Thursday, on December 26 from 8.08 am-11.16 am. As per temple tradition Srivari temple will remain shut from 11 pm of December 25 till 12.00 noon of December 26. 

Darshan will commence to devotees fro. 2.00 pm onwards. TTD has cancelled Tiruppavada, Kalyanotsavam, and Unjal seva, Arjita Brahmotsavam, Vasantotsavam.

In view of eclipse, Annaprasadam is also will not be served in complex or queue lines or at food courts. So the pilgrims are requested to make note of this and plan their pilgrimage to avoid any inconvenience.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

డిసెంబ‌రు 26న సూర్యగ్రహణం 13 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 16: సూర్యగ్రహణం కారణంగా డిసెంబ‌రు 25, 26వ తేదీల్లో రెండు రోజుల్లో క‌లిపి 13 గంట‌ల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

డిసెంబ‌రు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంట‌ల నుండి ఉదయం 11.16 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అనగా డిసెంబ‌రు 25న బుధ‌వారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం త‌లుపులు మూస్తారు. డిసెంబ‌రు 26న గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు తెరుస్తారు. ఆలయశుద్ధి అనంత‌రం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

ఆల‌యం తలుపులు మూసిన స‌మ‌యంలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి త‌మ తిరుమ‌ల యాత్ర‌కు ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా డిసెంబ‌రు 26న తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, వ‌సంతోత్స‌వం ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.