DHANUR MASAM RITUALS BEGIN FROM DEC 17 AT ALL TTD LOCAL TEMPLES _ టిటిడి అనుబంధ ఆలయాల్లో డిసెంబరు 17 నుంచి ధనుర్మాస కైంకర్యాలు

Tirupati, 16 Dec. 19: In view of the auspicious Dhanur Masam beginning from December 17, special rituals will be conducted in all TTD local temples till January 14.

The Dhanur Masam commenced from 11.47 pm on Monday, heralding a period of penance and special rituals as per Vaikhanasa agama.

At Sri Govindaraja Swamy Temple Dhanur Masam rituals will commence from 1.00 AM of December 17 and throughout the month the holy Tiruppavai pasurams will be recited in early hours from 4.00 am till 5.30 am.

At Sri Prasanna Venkateswara temple, Appalayagunta besides Tirupaavai recital, the special events will be held on New Years Day, Vaikunta Ekadasi on January 6, visesha puja on January 15th in view of Sankranti festival.

At Sri Kalyana Venkateswara Swamy Temple of Srinivasa Mangapuram, Dhanur masam rituals will commence at 11.00pm of December 16 and Tiruppavai will be recited every day in early hours thereafter till January 14. Special pujas will be performed on Vaikunta Ekadasi, New Year’s Day.

At the Kalyana Venkateswara temple of Narayanavanam, Sri Veda Narayana temple of Nagulapuram, Sri Channakesava temple of Tallapaka in YSR Kadapa district, Sri Siddeswaraswami temple and Sri Lakshmi Venkateswara temple of Devuni Kadapa and Sri Narapura Venkateswara temple of Jammalamadugu and Sri Padmavati sameta Venkateswara temple of Pithapuram in East Godavari Temple the Tiruppavai parayanam will be taken up.

The HDPP, Annamacharya Project will also present Harikatha parayanam and Bhakti sangeet during this holy month at all TTD temples. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడి అనుబంధ ఆలయాల్లో డిసెంబరు 17 నుంచి ధనుర్మాస కైంకర్యాలు

తిరుపతి, 2019 డిసెంబరు 16: టిటిడి అనుబంధ ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17వ తేదీ నుండి 2020, జనవరి 14వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. డిసెంబరు 16వ తేదీ రాత్రి 11.47 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కానుంది.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 16న రాత్రి 10.30 నుండి డిసెంబ‌రు 17వ తేదీ తెల్లవారుజామున 1.00  గంట వరకు ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు. ధనుర్మాసం సందర్భంగా  ఆలయంలో ప్రతి రోజూ తెల్లవారుజామున 4.00 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు తిరుపళ్లియళుచ్చి పారాయణం చేస్తారు.  

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 17వ తేదీ నుండి ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభం కానున్నాయి. 2020, జనవరి 1వ తేదీ నూతన ఆంగ్ల సంవత్సరాది, జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాదశి,  జనవరి 15న సంక్రాంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసం సందర్భంగా  ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుప్పావై పారాయణం చేస్తారు.

శ్రీ కల్యాణ వేంకటశ్వరస్వామివారి ఆలయంలో…

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 16న రాత్రి 11.00 రాత్రి 12.00 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు. డిసెంబరు 17వ తేదీ నుండి ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభం కానున్నాయి.

ఇందులో భాగంగా ప్రతిరోజూ తెల్లవారుజామున 4.00 నుంచి 5.30 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుపళ్లియళుచ్చి (తిరుప్పావై) పారాయణం చేస్తారు. వీటితోపాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని  ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు స్వామి, అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

అదేవిధంగా నారాయ‌ణ‌వ‌నంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, నాగ‌లాపురంలోని శ్రీ వేద‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యం, వైఎస్‌ఆర్‌ జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయం, దేవునికడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయం, జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17వ తేదీ నుండి 2020 జనవరి 14వ తేదీ వరకు తెల్లవారుజామున ద్రావిడ ప్రబంధం(తిరుప్పావై) పారాయణం చేస్తారు.  

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.